పారదర్శక పాలనే మోదీ సర్కారు లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పారదర్శక పాలనే మోదీ సర్కారు లక్ష్యం

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

ఆలేరు: అభివృద్ధి, పారదర్శక పాలనే ప్రధాని మోదీ సర్కారు లక్ష్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్‌ అన్నారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ 12ఏళ్ల ప్రగతీశీల పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ఆదివారం ఆలేరులో శ్రీఛాయ్‌పే చర్చశ్రీలో భాగంగా టిఫిన్‌ సెంటర్లు, టీ కొట్లను బీజేపీ నాయకులు సందర్శించారు. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, మౌలిక వసతుల కల్పనలో సాధించిన పురోగతిని వివరించారు. కామిటికారి కృష్ణ, తునికి దశరథ, బైరి మహేందర్‌, కల్లెం రాజు, చుక్క రాజు, సముద్రాల శ్రీను, పాశికంటి సోమయ్య, గుర్రం నర్సింహులు, శాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement