భూదాన్‌పోచంపల్లి : భూదాన వజ్రోత్సవాలను పురస్కరించుకుని నేటి యువతకు భూదా నోద్యమ చరిత్ర గొప్పదనాన్ని చాటిచెప్పేందుకు సంఘమిత్ర సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16న రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి నుంచి ప్రారంభించిన 55 కిలోమీటర్ల భూదాన స్ఫూర్తి పాదయాత్ర శనివారం పోచంపల్లికి చేరుకోవడంతో ముగిసింది. పట్టణ శివారులో పాదయాత్ర బృందానికి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఘనస్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం వినోబాభావే మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాదయాత్రలో పాల్గొన్న వారిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు శాలువాలు కప్పి, గాంధీజీ విగ్రహ మెమొంటోలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర ప్రతినిధులు తడక యాదగిరి, పట్నం కృష్ణకుమార్, పాదయాత్రికులు తడక రమేశ్, భారత లవకుమార్, గునిగంటి రమేశ్, రాపోలు జ్ఞానేశ్వర్, పట్నం పారిజాత, చింతకింది రమేశ్, అంకం పాండు, ఆటిపాముల మహేందర్, చక్రాల నర్సింహ, కర్నాటి బాలరాజు, మందుల యాదగిరి పాల్గొన్నారు.


