సాక్షి, యాదాద్రి : యాసంగి ధాన్యం దిగుమతుల్లో మిల్లుల యజమానులు జాప్యం లేకుండా వేగవంతం చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఆదేశించారు. 2025–26 ధాన్యం కొనుగోళ్లపై శనివారం కలెక్టరేట్‌లో మిల్లర్లు, సంబంధిత శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం యాసంగి 2024–25 కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువు పొడిగించినందున గడువులోగా ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, పౌరసరఫరాల సంస్థ జిల్లా నిర్వాహకులు హరికృష్ణ, మిల్లుల యజమానులు పాల్గొన్నారు.
సంక్షేమ వారం పకడ్బందీగా నిర్వహిస్తాం
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 20వ తేదీ నుంచి 26 వరకు ఏడు రోజుల పాటు సంక్షేమ వారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో మరమ్మతులు చేయిస్తామన్నారు. విద్యార్థులకు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాహితీ పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, వెంకారెడ్డి


