మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకోవడం దారుణం | - | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకోవడం దారుణం

Apr 19 2026 8:29 AM | Updated on Apr 19 2026 8:29 AM

భువనగిరి : మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించిన ఇండియా కూటమి తీరును ఖండిస్తూ బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని వినాయక చౌరస్తా వద్ద శనివారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు మాధురి చంద్ర మాట్లాడుతూ ప్రధాని మోదీ మహిళా సాధికారతకు బాటలు వేస్తుంటే.. ఇండియా కూటమి దానిని అడ్డుకోవడం దారుణమని విమర్శించారు. మహిళా బిల్లు 2008లో రాజ్యసభలో ఆమోదం పొందినా, లోక్‌సభలో ఎందుకు ప్రవేశపెట్టలేదని కాంగ్రెస్‌ను నిలదీశారు. మహిళా ఓట్ల కోసం నాటకాలు ఆడేవారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వంగేటి సుచరితరెడ్డి, బండారు స్వర్ణలత, తుమ్మల యాస్మిన్‌, బీజేపీ నాయకులు చందా మహేందర్‌ గుప్తా, పడమటి జగన్‌ మోహన్‌రెడ్డి, మేడి కోటేష్‌, తడిసిన మల్లారెడ్డి, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement