నకిరేకల్ : రోడ్డు ప్రమాదాల నివారణ.. భద్రతా చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తేవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కుమార్ సూచించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో బుధవారం రాత్రి ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ వారోత్సవాల సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. జాతీయ రహదారుౖలపై నిత్యం ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో వాటిని గుర్తించి అక్కడ అండర్ పాస్‌ల నిర్మాణానికి ప్రణాళిలకు రూపొందిస్తే సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఎవరైన మోటార్ సైకిల్‌పై వస్తే హెల్మెట్ లేకుండా రావొద్దని ఈ నియోజకవర్గంలో 40 మంది సర్పంచులు గ్రామ సభ తీర్మానాలు చేసి డీజీపీకి సమర్చించడం గొప్ప నిర్ణయమన్నారు. నకిరేకల్‌లో స్థలం చూస్తే ఇక్కడి ఎమ్మెల్యే వీరేశం కోరిన విధంగా మహనీయుల భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాల సమస్య పరిష్కారం కోసం చేపట్టే కార్యక్రమాల్లో వార్డు మెంబర్ నుంచి పైస్థాయి వరకు అందరిని, అన్ని శాఖల అధికారులను భాగస్వాములను చేయాలని పోలీస్ శాఖ పక్షాన సీఎంతో చర్చించామన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలందరు చైతన్యం కలిగి ఉండాలన్నారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ ఈనెల 13 నుంచి 18 వరకు జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత కార్యక్రమాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. జిల్లా జాతీయ రహదారిపై ఈ సంవత్సరం జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీ చౌహాన్, ఎమ్మెల్యేలు మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పాడిపరిశ్రమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అమిత్‌రెడ్డి, సూర్యాపేట ఎస్పీ నరసింహ, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ యానాల అశోక్‌రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, రోడ్డు భద్రత ప్రత్యేక అధికారి పోలిశెట్టి అంజయ్య, డీసీసీ అధ్యక్షుడు పున్న కేలాష్‌నేత, రాష్ట్ర నాయకులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, మార్కెట్, మున్సిపల్ చైర్‌పర్సన్లు గుత్తా మంజుల,చౌగోని రజితా, స్దానిక సీఐలు హరిబాబు, కొండల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రమాదాలు జరిగే చోట అండర్ పాస్‌లు నిర్మిస్తాం
ఫ రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్


