సాక్షి, యాదాద్రి : మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే భువనగిరి, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో కమిషనర్లు నోటిఫికేషన్ విడుదల కాగా.. మోత్కూరు, చౌటుప్పల్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే నోటిఫికేషన్ విడుదలైన ఏడు రోజుల్లో అభ్యర్థులు కో ఆప్షన్ పదవి కోసం మున్సిపాలిటీల్లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే కౌన్సిలర్ పదవితో దాదాపు సమానమైన కో ఆప్షన్ పదవికి ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. అన్ని మున్సిపాలిటీలను అధికార పార్టీ చేతుల్లో ఉండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు పొత్తు ఉన్న సీపీఐతో కలిసి కో ఆప్షన్ సభ్యుల ఎంపిక పై కసరత్తు చేస్తున్నారు.
ఏడు రోజుల గడువు
మున్సిపాలిటీలు కో ఆప్షన్ సభ్యుల దరఖాస్తుల స్వీకరణకు ఏడు రోజుల గడువు ఉంది. సెలవు రోజుల్లో కాకుండా ప్రభుత్వ పనిదినాల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో రెండు మైనార్టీ, రెండు జనరల్ కేటగిరిలో కో ఆప్షన్ సభ్యులకు అవకాశం ఉంది. జనరల్ కేటగిరి, మైనార్టీ కేటగిరిలో ఒక్కో మహిళా కో ఆప్షన్ సభ్యులు తప్పకుండా ఉండాలి.
ఫ మున్సిపాలిటీల వారీగా నోటిఫికేషన్లు విడుదల
ఫ మైనార్టీలో ఇద్దరు, జనరల్ కేటగిరీలో ఇద్దరు సభ్యులకు అవకాశం
ఫ ఆశావహుల్లో పెరిగిన ఆసక్తి


