ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

భువనగిరి : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఎంతమంది వైద్యులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అటెండెన్స్‌ రిజిస్టర్లను చెక్‌ చేసి, సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. అనంతరం ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించి ప్రతిరోజూ వచ్చే రోగుల సంఖ్యపై వివరాలు సేకరించారు. ఆస్పత్రి పరిసరాలను ప్రతిరోజూ శుభ్రం చేయించాలని, పారిశుద్ధ్యం విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులున్నారు.

ఫ అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement