ఎంజీయూ హాకీ జట్టు కోచ్‌గా లింగస్వామి
రామన్నపేట : మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) హాకీ జట్టు కోచ్‌గా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రాపోలు లింగస్వామి నియమితులయ్యారు. ఈ నెల 18వ తేదీ వరకు తమిళనాడు రాజధాని చైన్నెలోని సత్యభామ యూనివర్సిటీ మైదానంలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఛాపియన్‌షిప్‌లో పాల్గొనే ఎంజీయూ హాకీ జట్టుకు ఆయన కోచ్‌గా వ్యవహరించనున్నారు. లింగస్వామి నల్లగొండలోని ఎన్‌జీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో హాకీలో రాణించి ఎంజీయూ జట్టుకు ఎంపికై రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అతడి ప్రతిభను గుర్తించి హాకీ అసోసియేషన్, యూనివర్సిటీ క్రీడా విభాగం వారు కోచ్ బాధ్యతలను అప్పగించారు. లింగస్వామికి పలువురు అభినందనలు తెలిపారు.


