చేనేత కార్మికుల ఆమరణ దీక్ష
సంస్థాన్ నారాయణపురం : చేనేత రుణమాఫీ వెంటనే చేయాలని సోమవారం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో చేనేత కార్మికులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామానికి చెందిన వర్కాల వెంకటేశం, గూడెల్లి బాలరాజు దీక్ష చేపట్టగా వీరికి మద్దతుగా చేనేత కార్మికులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు గజం సత్యనారాయణ, చెరుపల్లి రామాలింగం, కర్నాటి శ్రీనివాస్, చిట్టిప్రోలు రమేష్. చిలుకూరి గిరి, దామర్ల వేణుగోపాల్, గంజి హరీష్, రవి, రామాలింగస్వామి, సైదులు, శేఖర్, రమేష్ పాల్గొన్నారు.


