
మద్యం టెండర్లకు 191 దరఖాస్తులు
భువనగిరి: నూతన మద్యం దుకాణాల కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. 82 మద్యం దుకాణాల గాను గత నెల 26నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం 191 దరఖాస్తులు రాగా.. అందులో గురువారం 34 వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. దరఖాస్తు గడువు ఈనెల 18వరకు ఉన్నట్లు పేర్కొన్నారు.
చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు
ఆలేరు: ఆలేరు పట్టణ శివారులో బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను గురువారం యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు సందర్శించారు. సీఐ యాలాద్రితో కలిసి ఏసీపీ వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల తనిఖీల్లో ఏమరుపాటుగా ఉండొద్దని చెక్‌పోస్ట్ సిబ్బందికి ఏసీపీ సూచించారు. ఒక ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ విధుల్లో ఉండాలన్నారు.
నాణ్యమైన విత్తనాలు తయారు చేసుకోవాలి
భూదాన్‌పోచంపల్లి: రైతులు నాణ్యమైన విత్తనాలను తయారు చేసుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ జి.శ్రీదేవి, డాక్టర్ శ్రీధర్‌సిద్ది, డాక్టర్ సుశీల సూచించారు. క్వాలిటీ సీడ్ ఎవ్రీ విలేజ్ కార్యక్రమం కింద భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పురం, వంకమామిడి, పిలాయిపల్లి, దేశ్‌ముఖి గ్రామాల్లో రైతులు సాగు చేసిన కేఎన్‌ఎం 1638 రకం సీడ్ వరి వరిపంటను పరిశీలించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వానాకాలం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు ఫౌండేషన్ సీడ్స్ కిట్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. యాసంగి పంటకు రైతులకు కావల్సిన నాణ్యమైన విత్తనాలను వారే సొంతంగా తయారు చేసుకోవాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమం కింద రైతులకు పలు సూచనలు కూడా చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి శైలజ, ఏఈఓలు ప్రియాంక, శ్వేత, నరేశ్, రాజేశ్, క్రాంతి, పవిత్రన్, రైతులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆలేరు విద్యార్థి
ఆలేరు: ఆలేరులోని మహా త్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, జూనియర్(రాజాపేట) కళాశాల విద్యార్థి బి.కృష్ణ (ఇంటర్ సెకండియర్) రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 8వ తేదీన భువనగిరిలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ అండర్–19 కబడ్డీ సెలక్షన్లలో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టు క్రీడాకారులతో కలిసి కృష్ణ పాల్గొని ప్రతిభను కనబరిచాడు. ఈనెల 11వ తేదీన మహబూబాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడని వైస్ ప్రిన్సిపాల్ కె.గీతాదేవి, పీడీ గడసంతల భాస్కర్ తెలిపారు.
నేత్రపర్వంగా నృసింహుడి నిత్యకల్యాణం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం నిత్యారాధనలో భాగంగా నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వివిధ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

మద్యం టెండర్లకు 191 దరఖాస్తులు

మద్యం టెండర్లకు 191 దరఖాస్తులు

మద్యం టెండర్లకు 191 దరఖాస్తులు