
జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన
సాక్షి యాదాద్రి, యాదగిరిగుట్ట : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్‌కుమార్‌సింగ్ శనివారం జిల్లాలో పర్యటించారు. ఉదయం రాజ్‌భవన్ నుంచి బయలుదేరి 10 గంటల 10 నిమిషాలకు యాదగిరి కొండపై వీఐపీ వసతిగృహానికి చేరుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి బ్యాటరీ వాహనంలో ఆలయ తూర్పు మాడ వీధికి వచ్చారు. తూర్పు ద్వారం గుండా ప్రధానాలయంలో వెళ్లారు. ఆంజనేయస్వామిని, ఆ తరువాత ధ్వజస్తంభానికి మొక్కారు. గర్భాలయంలోని స్వయంభూలకు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీఐపీ వసతిగృహానికి వెళ్లి, అక్కడినుంచి భువనగిరి శివారు మాసుకుంటకు చేరుకొని జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి, భువనగిరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.శరత్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజన, జస్టిస్ వి.రామకృష్ణారెడ్డి, భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు, మొదటి అదనపు జిల్లా జడ్జి ముక్తిదా, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్యాంసుందర్, భువనగిరి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, భువనగిరి జూనియర్ సివిల్ జడ్జి చండీశ్వరి, రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి సబిత, రామన్నపేట ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శిరీష, చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి, ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్, కలెక్టర్ హనుమంతరావు, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, డీసీపీ అక్షాంశ్‌యాదవ్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, రామన్నపేట, చౌటుప్పల్, ఆలేరు, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఫ ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్‌కుమార్‌సింగ్

జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన

జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన