
రిజర్వేషన్ల గందరగోళానికి కాంగ్రెస్సే కారణం
చౌటుప్పల్ : బీసీ రిజర్వేషన్ల గందరగోళానికి కాంగ్రెస్సే కారణమని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే చట్టపరంగా ముందుకు వెళ్లాల్సి ఉండేదని, బిల్లు ఆగిపోతుందని తెలిసే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు నాటకాలాడారని ధ్వజమెత్తారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో శనివారం మున్సిపాలిటీ బూత్ అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల పేరిట ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టే దుర్మార్గాన్ని బీసీలు గుర్తించారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధిస్తే బీజేపీకి ఏమి సంబంధమో కాంగ్రెస్ నాయకులు చెప్పాలన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో తనకు, తన కుటుంబసభ్యులకు ఎలాంటి వాటాలు లేవని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రుజువు చేసుకోవాలని, లేకుంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు లేకుండానే మున్సిపాలిటీ, మండలంలో పోటీ చేస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన, నాయకులు ముత్యాల భూపాల్‌రెడ్డి, పోలోజు శ్రీధర్‌బాబు, రమనగోని దీపిక, ఆలె చిరంజీవి, బత్తుల జంగయ్య,ఊడుగు వెంకటేశం, కడవేరు పాండు, చీకూరు ప్రభాకర్, ఊదరి రంగయ్య, భానుప్రకాష్, నాగరాజు, జి.వేణు, సాయికుమార్, సురేష్, రాజశేఖర్, రవి, దామోదర్‌రెడ్డి, భరత్, శేఖర్, సత్తిరెడ్డి, ఆనంద్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
నాగం వర్షిత్‌రెడ్డి