
కల్తీ వరి విత్తనాలు వచ్చాయని రైతుల ఆందోళన
కోదాడరూరల్ : మండల పరిధిలోని కూచిపూడిలో చింట్లు సీడ్ రకం వరి విత్తనాల్లో కల్తీ విత్తనాలు వచ్చాయని శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. కోదాడకు చెందిన ముగ్గురు విత్తన దుకాణాదారులకు, సంబంధిత డీలర్లకు గతం వారం రోజులుగా చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వరి సాగు పొట్టదశకు రావడంతో ముందుగా బెరుకులు ఈతకు వచ్చాయని అవి దొడ్డురకంగా ఉన్నాయని తెలిపారు. ఈ విధంగా బెరుకులు రావడంతో ఎకరానికి 5బస్తాల దిగుబడిపై ప్రభావం పడుతుందన్నారు. గ్రామంలో దాదాపుగా 150 మంది రైతుల భూమికి సంబంధించి 300 ఎకరాల్లో బెరుకులు ఈవిధంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంగా.. శుక్రవారం పంట పరిశీలనకు ఆయా కంపెనీల డీలర్లు వచ్చారు. న్యాయం చేయాలని కోరితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపిస్తూ రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. వారి నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. సీడ్ డీలర్, డిస్ట్రిబ్యూటర్లు వచ్చి న్యాయం చేసిన తర్వాతే కారు ఇస్తామని రైతులు తెలిపారు. కార్యక్రమంలో శిరంశెట్టి రామారావు, శెట్టి శ్రీనివాసరావు, శిరంశెట్టి రవి, రామారావు, చాప సురేష్, కొండ, రమణ , చేతుల రామకష్ణ, తెల్లగొర్ల రామకష్ణ, తిరపతిరావు పాల్గొన్నారు.