
ఆస్తి కోసం తండ్రిపై హత్యాయత్నం
పెన్‌పహాడ్: ఆస్తి కోసం ఓ వ్యక్తిపై ఇద్దరు కుమారులతోపాటు, అతడి భార్య హత్యాయత్నానికి పాల్ప డ్డారు. ఈ సంఘటన మండల పరిధిలోని మేగ్యాతండా తండాలో ఈ నెల 7న చోటు చేసుకుంది. శుక్రవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీఐ రాజశేఖర్ వివరాలు వెల్లడించారు. తండాకు చెందిన ఆంగోతు కుర్వా, కోటమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు పవన్‌కళ్యాణ్, ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. భార్యకు అక్రమ సంబంధం ఉందని భావించిన కుర్వా గత నాలుగేళ్లుగా వేరుగా ఉంటున్నాడు. కుర్వా పేరు మీద 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే తన తండ్రి బతికి ఉంటే ఆ భూమి తమకు దక్కదనే ఉద్దేశంతో అతడిని హత్య చేయడానికి కుట్ర పన్నారు. ఈ నెల 7న అర్ధరాత్రి కోటమ్మతో పాటు కుమారులు ఇంటికి వెళ్లి కుర్వాపై దాడి చేశారు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. కళ్లకు గంతలు కట్టి ఇనుపరాడ్డు, కర్రతో కాళ్లు, చేతులపై, ఎడమ దవడపై కొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కల వారు చూసే సరికి భయంతో తండ్రిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పవన్‌కళ్యాణ్, ప్రవీణ్‌కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కుర్వా భార్య కోటమ్మ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ గోపికృష్ణ, కానిస్టేబుల్స్ లింగరాజు, సైదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ ఇద్దరు కుమారుల అరెస్ట్
ఫ వివరాలు వెల్లడించిన సీఐ రాజశేఖర్