
నాలుగు గేట్ల ద్వారా సాగర్ నీటి విడుదల
నాగార్జునసాగర్: ఎగువ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 83,888 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. 4 గేట్ల ద్వారా 32,400 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 33,495 క్యూసెక్కులు మొత్తం 65,895 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. కుడికాల్వ, ఎడమ కాల్వ, ఏఎమ్మారీల కాల్వలకు 17,993 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా జలాశయంలో అంతే నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.