
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శుక్రవారం 5,838 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. దీంతో 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో నీటిమట్టం 644.28 అడుగుల వద్ద ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 6,437 క్యూసెక్కుల నీటిని దిగవకు వదులుతున్నారు. ఆయకట్టులో పంటల సాగుకు కుడి, ఎడమ ప్రధాన కాల్వకు 340 క్యూసెక్కులు వదులుతున్నారు. గేట్ల ద్వారా, కాల్వలకు మొత్తం 6,826 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. మూసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.27 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.