అర్ధరాత్రి అక్రమ తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి అక్రమ తవ్వకాలు

Jun 25 2026 12:24 AM | Updated on Jun 25 2026 12:24 AM

అర్ధరాత్రి అక్రమ తవ్వకాలు

ఆగిరిపల్లి: మండలంలోని చిన్నగిరిపల్లిలోని పులిచెరికుంట చెరువును అక్రమార్కులు రాత్రి వేళల్లో జేసీబీలతో అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా అధికార పార్టీ నాయకుల అండ చూసుకొని రాత్రిపూట పులి చెరుకుంట చెరువును తవ్వేస్తున్నారు. ప్రతిరోజు గుట్టు చప్పుడు కాకుండా చెరువులో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. అర్ధరాత్రి దాటితే చాలు చెరువులోని మట్టి మండల కేంద్రమైన ఆగిరిపల్లికి తరలించి జేబులు నింపుకుంటున్నారు. చెరువును ఇష్టం వచ్చినట్టు తవ్వేయడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలం కావడంతో పశువులు గుంతలలో పడి మృత్యువాత పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మట్టి అక్రమ దందా చేస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement