ఉపకారాగారాన్నిసందర్శించిన న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

ఉపకారాగారాన్నిసందర్శించిన న్యాయమూర్తి

Jun 25 2026 12:24 AM | Updated on Jun 25 2026 12:24 AM

ఉపకారాగారాన్నిసందర్శించిన న్యాయమూర్తి రాట్నాలమ్మ దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు పెళ్లి ట్రాక్టర్‌ బోల్తా.. తప్పిన ప్రమాదం వడాలిలో అగ్నిప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొని యువకుడు దుర్మరణం

భీమవరం: పట్టణంలోని ప్రత్యేక ఉపకారాగారాన్ని బుధవారం ఒకటవ అదనపు జ్యుడీషియల్‌ మొదటి తరగతి మేజిస్ట్రేట్‌ పి హనీష సందర్శించారు. ముద్దాయిలతో మాట్లాడి వారి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బెయిల్‌ మంజూరైన ముద్దాయిలు జామీన్లను కోర్టుకు సమర్పిస్తే విడుదలకు ఆదేశాలు జారీ చేస్తారన్నారు. ఆర్థిక స్థోమత కారణంగా న్యాయవాదిని నియమించుకోలేకపోతే అర్జీ పెట్టుకుంటే ఉచిత న్యాయవాదిని నియమిస్తామన్నారు. అనంతరం జైలు పరిసరాలను, గదులు, వంటగదిని పరిశీలించి ముద్దాయిలకు అందజేస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ డి వెంకటగిరి, ప్యానల్‌ న్యాయవాదులు కె.వెంకటరమణ, ఎస్‌.నాగబాబు, ఎ.పద్మ, బి.సునీత, ఎం.మాలిక, కె.అమూల్య, పారా లీగల్‌ వాలంటీర్‌ కె.నాగేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంటలోని శ్రీ రాట్నాలమ్మ తల్లి దేవస్థానంలో హుండీలను బుధవారం లెక్కింపు నిర్వహించినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పి రేనా మాధురి తెలిపారు. 58 రోజులకు గాను రూ.12,66,336 ఆదాయం లభించినట్లు వెల్లడించారు. గ్రామ పెద్దల సమక్షంలో ఆలయ చైర్మన్‌ మన్నే శ్రీనివాసరావు, కార్యనిర్వహణ అధికారి సతీష్‌ కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ విడుదల సత్యనారాయణ పర్యవేక్షణలో లెక్కింపు కార్యక్రమం జరిగిందన్నారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు.

బుట్టాయగూడెం : వేపులపాడు రామచంద్రాపురం సమీపంలో బుధవారం ఓ పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. వివరాల ప్రకారం బుట్టాయగూడెం సమీపంలోని ఒక గ్రామానికి చెందిన పెళ్లి బృందం 20 మందితో ట్రాక్టర్‌పై ఖమ్మం జిల్లా కావిడిగుండ్ల వెళ్తుండగా వేపులపాడు రామచంద్రాపురం సమీపంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. పెళ్లి బృందం సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ముదినేపల్లి (కై కలూరు) : మండలంలోని వడాలి గ్రామంలో లద్దిక నాగేశ్వరరావుకు చెందిన తాటాకిల్లు షార్ట్‌ సర్క్యూట్‌తో బుధవారం దగ్ధమైంది. విషయం తెలుసుకున్న కై కలూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన వచ్చి ఫైర్‌ ఇంజన్‌తో మంటలను అదుపు చేశారు. అప్పటికే తాటాకుల షెడ్‌ పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.70 వేలు ఆస్తి నష్టం వాటిల్లిందని ఫైర్‌ సిబ్బంది తెలిపారు. సహాయక చర్యల్లో ఫైర్‌ ఆఫీసర్‌ కె.క్రాంతికుమార్‌, ఫైర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: స్థానిక జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పనిచేస్తున్న రెడ్డి గోపాలపోసి (31) మంగళవారం సాయంత్రం పని నిమిత్తం మోటార్‌సైకిల్‌పై రాజమండ్రి వెళ్లాడు. తిరిగి బుధవారం తెల్లవారుజామున జంగారెడ్డిగూడెం వస్తుండగా, స్థానిక ఫైర్‌ స్టేషన్‌ సమీపంలోని డిస్టలరీ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అతడి మోటార్‌సైకిల్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గోపాలపోసి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement