క్వారీలో ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్‌లు | - | Sakshi
Sakshi News home page

క్వారీలో ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్‌లు

Jun 25 2026 12:24 AM | Updated on Jun 25 2026 12:24 AM

ఆగిరిపల్లి: మండలంలోని నరసింగపాలెంలో క్వారీకి అనుమతి తీసుకొని నిబంధనలకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్రమ బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్నారని, దీంతో భయాందోళనగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. నరసింగపాలెం సమీపంలో ఉన్న క్వారీలో గ్రావెల్‌ తవ్వకాల కోసం కొన్ని రోజులుగా బ్లాస్టింగ్‌ చేస్తున్నారని, దీంతో గ్రామంలో దుమ్ము, ధూళి వ్యాపించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అంతేకాకుండా పంట పొలాలు సైతం నాశనం అవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీలో నిరంతరం బ్లాస్టింగ్‌ వల్ల నివాస గృహాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి క్వారీలో జరుగుతున్న బ్లాస్టింగ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement