ఇసుక లారీ ఢీకొని భార్యాభర్తలకు తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

ఇసుక లారీ ఢీకొని భార్యాభర్తలకు తీవ్రగాయాలు

Jun 25 2026 12:24 AM | Updated on Jun 25 2026 12:24 AM

కొత్తపేట: కుమార్తె పెళ్లి శుభలేఖలు పంచి వస్తున్న దంపతులను ఇసుక లారీ ఢీకొంది. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం తామరాడ గ్రామానికి చెందిన దాసిరెడ్డి నాగ వెంకట రామకృష్ణ, ధనలక్ష్మి కుమార్తెకు జూలై ఒకటిన వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ దంపతులు శుభలేఖలు పంచేందుకు మోటార్‌ సైకిల్‌పై ముమ్మిడివరంలో బంధువుల ఇళ్లకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో కొత్తపేట బోడిపాలెం సమీపానికి వచ్చేపరికి ఎదురుగా ఇసుక లోడుతో వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స జరిపి, ఉన్నత వైద్యం కోసం తణుకు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement