న్యూస్‌రీల్
కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారు
గోదావరికి వరదల సమయంలో ఇసుక అక్రమ వ్యాపారంపై కూటమి నేతలు కన్నేశారు. ఇసుక స్టాకులు సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు విరుద్ధంగా వశిష్ట గోదావరిలో అక్రమ తవ్వకాలు చేస్తూ కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొడుతున్నారు.
గురువారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2026
భీమవరం (ప్రకాశంచౌక్): డీపీఓగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కె.అనురాధ బుధవారం కలెక్టర్ సీహెచ్ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభినందిస్తూ ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాల మేరకు సమర్ధవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
భీమవరం: ఎన్నికల్లో మున్సిపల్ కార్మికులకు కూటమి నాయకులిచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులపై పాలకులు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను విడనాడాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నెక్కంటి సుబ్బారావు డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ఏఐటీయుసీ అధ్వర్యంలో నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. మున్సిపల్ వర్కర్స్ అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం సంఘటిత ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అప్కాస్ వర్కర్స్‌ను పర్మినెంట్ చేస్తామని, అపరిష్కృత సమస్యలను పరిష్కరిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టి రెండేళ్లయినా నేటికీ వాటి అమలు పట్టించుకోవడం లేదన్నారు. ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమరావు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ కిలారి మల్లేశ్వరరావు, ఏఐటీయుసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే దాడులకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల నమోదు, విచారణలో జాప్యానికి తావులేకుండా చూడాలని, ముఖ్యంగా ఎఫ్‌ఐఆర్ నమోదు, చార్జ్‌షీట్ దాఖలు దశల్లో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీలను ఆదేశించారు. డీవీఎంసీ సభ్యులు కె.చిన్నపెద్దిరాజు, కె.రాజశేఖర్, ఎస్.జగపతి రామయ్య, ఎన్జీవో ప్రతినిధి వి.ఆశాజ్యోతి వివిధ సమస్యలను ప్రస్తావించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రత్యేక సంక్షిప్త సవరణ సర్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ చాంబర్‌లో కలెక్టర్ అధ్యక్షతన డీఆర్‌ఓ, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో సర్ కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు. బూత్ లెవల్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయాలని, ప్రజలకు ఫారాల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీలో ఉన్న 10 వేల పోస్టుల ఖాళీలను వెంటనే భర్తిచేయాలని, సీ్త్ర–శక్తి పథకం విజయవంతంగా నడవాలంటే వెంటనే 4 వేల కొత్త బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని ఏపీ పీటీడీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం ఏపీ పీటీడీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలీనానికి ముందున్న పాత పద్ధతిలో రిఫరల్ ఆసుపత్రుల ద్వారా వైద్యసౌకర్యాలు అందించాలని కోరారు.
సాక్షి, భీమవరం : సాధారణంగా జూలై నుంచి గోదావరికి వరదలు మొదలై దాదాపు నాలుగు నెలల పాటు ర్యాంపులు మూతపడతాయి. ఇసుక లభ్యత తగ్గి డిమాండ్ పెరుగుతుంది. ఇదే అదనుగా సొమ్ము చేసుకునే పనిలో కూటమి నాయకులు ఉన్నారు. జిల్లాలోని వశిష్ట గోదావరి తీరం వెంట సిద్ధాంతం, కరుగోరుమిల్లి, కోడేరు, నడిపూడి ఓపెన్ రీచ్‌లు, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, యలమంచిలిలంక, చించినాడ, మాధవాయిపాలెంలోని డీసిల్టేషన్ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వకాలు చేసేవారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని కోస్టల్ రెగ్యులర్ జోన్ (సీఆర్‌జెడ్)గా ప్రకటించింది.
సముద్రపు పోటుతో ఉప్పునీటి సాంద్రత వల్ల ఈ ర్యాంపుల్లోని ఇసుక నిర్మాణాలకు పనికిరాదని ర్యాంపులు మూసివేశారు. జిల్లా అవసరాల నిమిత్తం తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోని ర్యాంపుల నుంచి ఇసుకను తెస్తున్నారు. కూటమి వచ్చాక సీఆర్‌జెడ్ నిబంధలకు విరుద్ధంగా నడిపూడి, కరుగోరుమిల్లి తదితర చోట్ల కూటమి నాయకులు నదీ గర్భానికి తూట్లుపొడుస్తూ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుండటంపై స్థానికులు హైకోర్టును ఆశ్రయించగా తవ్వకాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఇప్పుడూ అదే దోపిడీ
పాత స్టాకులు మిగిలిపోవడంతో కొత్తగా స్టాకులు పెట్టడం లేదని మైనింగ్ అధికారులు అంటున్నారు. ఇసుక అవసరాల నిమిత్తం జిల్లాకు కేటాయించిన పెండ్యాల ర్యాంపు వద్దనే ఇసుక నిల్వ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆచంట, పెనుగొండ, పోడూరు, యలమంచిలి తదితర మండలాల్లో భారీ ఎత్తున ఇసుక నిల్వ చేసే పనిలో కూటమి నేతలు ఉన్నారు. ఇప్పటికే సిద్ధాంతం వంతెన వద్ద, ఆచంట మండలంలోను నిల్వలు చేస్తున్నారు. వీటిలో ఎన్నింటికి అనుమతులు ఉన్నాయి?, వేటికి లేవో? తెలీని పరిస్థితి. మరోపక్క హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నడిపూడి వద్ద గోదావరిలో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు లంక భూములు, నక్కల డ్రెయిన్ గట్లు గుల్ల చేసి ఇప్పుడు గోదావరిలో ఇసుకను కొల్లగొడుతున్నారని స్థానికులు అంటున్నారు. రోజూ అధిక సంఖ్యలో లారీల్లో ఇసుకను తరలించుకుపోతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలుండటంతో అధికారులు తవ్వకాలు వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలున్నాయి. ఇసుకను బయట అమ్మకాలు చేయడంతో పాటు వర్షాకాలం నిల్వలకు తరలిస్తున్నారంటున్నారు. నిర్మాణ అవసరాల పేరిట చోటామోటా నాయకులు సైతం వీలైనంత మొత్తంలో స్టాకులు పెట్టుకునే పనిలో ఉన్నారు. ఉప్పు సాంద్రత ఉండే ఈ ఇసుకతో నిర్మాణాలు చేయడం వలన మన్నిక కాలం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
నడిపూడి వద్ద తరలింపు కోసం గోదావరిలో సిద్ధం చేసిన ఇసుక గుట్ట
నడిపూడి వద్ద అనధికారిక ఇసుక తవ్వకాల కోసం తెచ్చిన పొక్లెయిన్
భీమవరం: రాష్ట్రంలో విద్యావ్యవస్ధ అస్తవ్యస్తంగా మారిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన శాఖను పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్‌ను ప్రోత్సహిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్ ధ్వజమెత్తారు. భీమవరంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చల విడిగా విద్యావ్యాపారం చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సక్రమంగా ఇవ్వకపోవడంతో విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్స్ తెరచి పది రోజులు గడిచిపోయినా విద్యార్థులకు యూనిఫాం, షూస్, బ్యాగ్‌లు పంపిణీ చేయలేదని దీనికి యుద్ధం బూచిగా చూపుతున్నారని ప్రైవేట్ స్కూల్స్‌లో బ్యాగ్స్ ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. భీమవరం పట్టణంలో నారాయణ స్కూల్ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తుండగా ఆందోళన చేయడంతో సీజ్ చేశారని అధికారం బలంతో మూడు రోజులకే స్కూల్ తెరచి తరగతులు నిర్వహిస్తున్నారన్నారు.
తాడేపల్లిగూడెం: సురక్షితమైన పైప్‌లైన్ గ్యాస్‌లైన్లను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో పైప్‌గ్యాస్ గృహ కనెక్షన్ల పంపిణీ, వినియోగంపై సమీక్షించారు. పట్టణంలోని ప్రతి ఇంటికి పైప్‌లైన్ గ్యాస్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, జీజీపీఎల్ సేల్స్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. గోదావరి గ్యాస్ ద్వారా ఇప్పటికే 80 పైప్‌లైన్ కనెక్షన్లను పునరుద్ధరించామన్నారు. ఎల్పీజీతో పోలిస్తే 24 గంటల సరఫరా జరుగుతుందన్నారు. ఎప్‌సీఐ కాలనీలో పీఎన్‌జీ సేవలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ మన్యం సూర్యారావు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ హెప్సిబా, డీఎస్‌ఓ ఎన్.సరోజ, మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.
భీమవరంలో మాట్లాడుతున్న గాంధీభగవాన్‌రాజు
భీమవరం: రొయ్యల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీడ్ ధరలు తగ్గింపు, రొయ్యల ధరల పెంపు విషయంలో ఇచ్చిన హామీని పూర్తిస్ధాయిలో అమలుచేయకుంటే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని రొయ్యల రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు చెప్పారు. భీమవరంలో బుధవారం సంఘం సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫీడ్ ధరను కిలోకు రూ.4 తగ్గించడానికి ఫీడ్ కంపెనీలు అంగీకరించాయని క్షేత్రస్ధాయిలో కేవలం రూ.2 మాత్రమే తగ్గించి రైతులను మోసం చేస్తున్నారన్నారు. కంపెనీలు ధర తగ్గించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలని విషయంపై చర్చించినట్లు చెప్పారు. ఫీడ్ కంపెనీలు ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదన్నారు. రైతు సంఘాలు ఫీడ్ కిలో రూ.8 తగ్గించాలని డిమాండ్ చేయగా రూ.4 మాత్రమే తగ్గిస్తామని చెప్పారని, రొయ్య రైతుల ఇబ్బందులు ఫీడ్ కంపెనీల యజమానులకు పట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యల రైతుల సంఘం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
సీఆర్‌జెడ్ పరిధిలో ఇసుక తవ్వకాలు జరపకూడదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కూటమి నాయకులు విచ్చలవిడిగా సీఆర్‌జెడ్ పరిధిలో ఇసుక తవ్వి అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. అక్రమార్జనకు కూటమి నాయకులు పాల్పడుతున్నారు. అనుమతులు లేకపోయినా స్టాక్ పాయింట్లు పెడుతున్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాం.
– చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ మంత్రి
కాసుల గుట్టలు
వర్షాకాలంలో సొమ్ము చేసుకునే పనిలో నేతలు
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక నిల్వలు
కోర్టు ఆదేశాలు బేఖాతరు
సీఆర్‌జెడ్‌లో అనధికార తవ్వకాలు
ఆచంటలో అక్రమ స్టాకులు
‘స్టాక్’గా దోచేశారు
వరదల సమయంలో ఇసుక కొరత లేకుండా గత ఏడాది సాండ్ కమిటీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్టాక్ పాయింట్ ఏర్పాటుచేశారు. ఒక్కో పాయింట్‌లో 70 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేయాలని నిర్ణయించగా జిల్లా అంతటా 1.20 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే స్టాకు పెట్టారు. ర్యాంపు నుంచి స్టాక్ పాయింట్లకు మధ్య దూరాన్ని బట్టి మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.306 నుంచి రూ.581 ధరలు నిర్ణయించారు. మరోపక్క కూటమి నాయకులు సిద్ధాంతం వంతెన దిగువన, ఆచంట నియోజకవర్గంలోను నిల్వలు ఏర్పాటుచేశారు. అధికారిక స్టాకు పాయింట్లతో పోలిస్తే తక్కువ ధరకే అమ్మకాలు చేసి రూ.కోట్లల్లో సొమ్ము చేసుకున్నారు.


