పాలకొల్లు సెంట్రల్: ‘ఉదయం బాలభవన్... సాయంత్రం క్లబ్ పార్కింగ్’ శీర్షికతో సాక్షిలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం కలెక్టర్ ఆదేశాలతో అధికారులు బాలభవన్ స్థలాన్ని పర్యవేక్షించారు. మెటీరియల్ వేసిన క్లబ్ నిర్వాహకులను పిలిచి మాట్లాడారు. వారం రోజుల్లో మహిళా మండలి భవనం, బాలభవన్ చుట్టూ ఉన్న భవన నిర్మాణ మెటీరియల్ తొలగించి పడగొట్టిన ప్రహరీగోడను నిర్మించి అప్పగించాలని క్లబ్ నిర్వాహకులను హెచ్చరించారు. వారం రోజుల్లో మెటీరియల్ తీసి బాలభవన్‌కు అప్పగించాలని లేదంటే కలెక్టర్ ఆదేశాల ప్రకారం క్లబ్ సీజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. వీఆర్‌వో పర్యవేక్షణ చేస్తారని తహసీల్దార్ తెలిపారు.


