న్యూస్‌రీల్
నమ్మించి వంచించారు
నాడు లక్ష్యానికి మించి..
ఆలయ వార్షికోత్సవం
దెందులూరు: కొత్తపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామిని విశేషంగా అలంకరించి పూజలు చేశారు.
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: అన్నదాత సుఖీభవ అమలులో ఎన్నికల హామీని చంద్రబాబు సర్కారు తుంగలోకి తొక్కింది. జిల్లాలో 75 వేల మందికి పైగా కౌలు రైతులు ఉండగా రెండో ఏడాది సాయానికి మొండి చేయి చూపింది. కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా వారి ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాలో 1.5 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉండగా వీరిలో దాదాపు 75 వేల మందికి కౌలు గుర్తింపు కార్డులు న్నాయి. సాగులో కష్టం వస్తే ముందుగా కుదేల య్యేది కౌలు రైతులే. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టడం, వచ్చిన పంటలో యజమానికి మిగతా చెల్లించగా వారికి మిగిలేది నామమాత్రమే. పంట తెగుళ్లు, ప్రకృతి విపత్తులతో పంటకు నష్టం కలిగితే అప్పుల ఊబిలో కూరుకుపోయేది వీరే. మరో పని తెలియకపోవడం, పశుపోషణ కోసం కష్టనష్టాలకోర్చి కౌలు సాగుకే మొగ్గుచూపుతుంటారు.
కూటమి దగా
అసలు రైతుల మాదిరి కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు పదేపదే చెప్పుకొచ్చారు. గత ఏడాది మూడు విడతల్లోనూ కూటమి ప్రభుత్వం కౌలు రైతులను పరిగణనలోకి తీసుకోలేదు. 2026–27 సీజన్‌కు రెండు రోజుల క్రితం తొలివిడతగా జిల్లాలోని 1,03,760 మంది రైతులకు రూ. 68.93 కోట్ల సాయం అందించారు. ఈ ఏడాదైనా తమకు అన్నదాత సుఖీభవ సాయం అందుతుందని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. అన్నదాత సుఖీభవ పోర్టల్‌లో కనీసం కౌలు రైతులు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ ప్రభుత్వం ఇవ్వకపోవడం గమనార్హం. పెట్టుబడి సాయం విడుదల చేయాలని, పంట నష్టపరిహారం ఇవ్వాలని, భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులుకు గుర్తింపు కార్డులు జారీచేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కేంద్రాల్లో రెండు రోజుల పాటు నిరసన దీక్షలు నిర్వహించినా కూటమి ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.
గత ప్రభుత్వంలో కౌలు గుర్తింపు కార్డు ఇవ్వడంతో పాటు రైతు భరోసాగా ఏటా రూ.13,500 సాయం అందిస్తే ఈ ప్రభుత్వం వచ్చాక సాయం ఆపేశారని కౌలు రైతులు వాపోతున్నారు. కౌలు గుర్తింపు కార్డు ఉన్నా ప్రయోజనం లేదంటున్నారు. రెండేళ్ల కూటమి పాలనలో ప్రచార ఆర్భాటమే తప్ప తమకు ఒరిగిందేమి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం రైతు భరోసా, ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించి కౌలు రైతులను ఆదుకుంది. తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులను ఆదుకుంటామని ఎన్నికల్లో కూటమి నాయకులు చెప్పుకొచ్చారు. ఇంతవరకు కౌలు రైతులకు చేసిందేమీ లేదు. గత తొలకరిలో మొంథా తుఫాను వలన జిల్లాలోని 21,236 మంది కౌలు రైతులకు చెందిన రూ. 22.5 కోట్లు మేర పంటనష్టం వాటిల్లితే ఇప్పటికి పరిహారం ఇవ్వలేదు.
– రామాంజనేయులు,
కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
ఏఐ సృష్టించిన
చిత్రం
కౌలు రైతులకు జగన్ సర్కారు కొండంత అండగా నిలిచింది. అసలు రైతుల మాదిరి రైతుభరోసా, పంటల బీమా పరిహారం, తదితర అన్ని రకాల ప్రయోజనాలను వారికి అందించింది. భూ యజమానుల హక్కులకు భంగం కలుగకుండా కేవలం 11 నెలల కాలానికి సాగు ఒప్పందం చేస్తూ 2011 కౌలు చట్టాన్ని సవరించింది. ఖరీఫ్, రబీ సీజన్‌కు సంబంధించి ఒకసారి జారీచేసిన కార్డును మళ్లీ యజమాని అంగీకారం మేరకు రెన్యువల్ చేసుకునే వీలు కల్పించారు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. భూ యజమానుల్లో అపోహలు తొలగడంతో జిల్లాలో సీసీఆర్‌సీ కార్డుదారుల జారీ గణనీయంగా పెరిగింది. 2023–24 సీజన్‌లో జిల్లాలో 84,185 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ లక్ష్యానికి 89,589 కార్డులు జారీచేశారు. జగన్ పాలనలో లక్ష్యానికి మించి కార్డులు జారీ చేస్తే కూటమి పాలనలో కార్డుల సంఖ్య తగ్గించేశారు. గత సీజన్‌లో జిల్లాలో 1.05 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా కేవలం 72,259 మందికి మాత్రమే ఇచ్చారు.
కౌలు రైతులకు కూటమి దగా
ఈ ఏడాది అన్నదాత సుఖీభవ సాయానికి మొండిచేయి
కౌలురైతులను పరిగణనలోకి తీసుకోని ప్రభుత్వం
జిల్లాలో 75 వేల మంది కౌలురైతుల ఆశలపై నీళ్లు


