నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాన్ని ఈనెల 27న నిర్వహించనున్నట్టు వైస్ చాన్సలర్ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు తెలిపారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే స్నాతకోత్సవంలో ముఖ్య అతిథులుగా నీతి ఆయోగ్ సభ్యుడు ఆచార్య గోవర్ధన్‌దాస్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారన్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లా సహకార శాఖలో అవినీతి హద్దులు దాటుతోంది. సొసైటీ ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా కోట్లాది రూపాయలు గోల్‌మాల్ చేయడం, పక్కదారి పట్టించడం వంటి వ్యవహారాలపై విచారణ జరిగినా చర్యలు మాత్రం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. పదుల సంఖ్యలో సొసైటీల్లో భారీగా అవకతవకలు గుర్తించి కోట్లాది రూపాయలను కొందరు అధికారులు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నా చర్యలు తీసుకోకపోవడం అవినీతికి పరాకాష్టగా నిలుస్తోంది. రంగాపురం, టి.నర్సాపురం సొసైటీల్లో అవకతవకలను గుర్తించి చర్యలకు సిఫార్సులు చేసినా నెలల తరబడి పెండింగ్‌లోనే ఉన్న పరిస్థితి.
రూ.కోట్లు నొక్కేసినా..
లింగపాలెం మండలంలోని రంగాపురం సొసైటీలో రుణాలను రైతులు తిరిగి చెల్లించినా కార్యదర్శి వ్యక్తిగతంగా వినియోగించుకోవడంతో పాటు ఎరువుల లోన్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. సొసైటీ కా ర్యదర్శి సీహెచ్ ప్రసాద్, పాలకవర్గ అధ్యక్షుడు రూ.2,06,16,302 దుర్వినియోగానికి పాల్పడినట్టు గుర్తించి విచారణ అధికారులు కార్యదర్శిని సస్పెండ్ చేశారు. ఇదే వ్యవహారంలో చింతలపూడి బ్రాంచ్ మేనేజర్లు టి.చంద్రశేఖర్, జి.మారేశ్వరరావు, అసిస్టెంట్ మేనేజర్ ఎస్‌వీ శ్రీనివాసరావు, ఇతర ఫీల్డ్‌సాఫ్ట్ ప్రమేయం ఉందని విచారణ అధికారి ఏడు నెలల క్రితం నివేదిక సమర్పించినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. అలాగే ఇక్కడ ఎరువుల విక్రయాల్లో రూ.41.85 లక్షలు, రుణాల్లో రూ.15.65 లక్షల అవకతవకలు జరగ్గా రూ.14.53 లక్షలు రికవరీ, చెల్లించిన రూ.59.94 లక్షల రుణాలను క్యాష్ రూపంలో చూపించకపోవడం, షేర్ క్యాపిటల్ కంటే క్యాష్ బ్యాలెన్స్ ఎక్కువగా చూపడం వంటివి చేశారు. ఈ కోణంలో విచారణ అధికారిగా ఉన్న డిప్యూటీ రిజిస్ట్రార్ డీసీఓకు నివేదిక ఇచ్చి క్రిమినల్ చర్యలకు సిఫార్సులు చేసినా జిల్లా సహకార శాఖ అధికారి ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టేశారు.
రుణాలు జమచేయరు.. డాక్యుమెంట్లు ఇవ్వరు
అలాగే టి.నర్సాపురం సొసైటీలో అప్పటి మేనే జర్లు, కుటుంబసభ్యుల పేరుతో రుణాలు తీసుకున్నట్టు విచారణలో నిర్ధారించినా చర్యలు మాత్రం తీసుకోలేదు. ఈ వ్యవహారం కూడా సహకార శాఖ అధికారి వద్దే పెండింగ్‌లో ఉంది. ఇలా పలు రిపోర్టులు భారీ వ్యవహారాలతో పెండింగ్‌లో ఉంటా యనేది శాఖాపరమైన టాక్. తాజాగా జంగారెడ్డిగూడేనికి చెందిన ఓ రైతు సొసైటీలో చెల్లించిన రుణాన్ని కార్యదర్శి వ్యక్తిగతంగా వాడుకోవడంతో పాటు డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పె డుతున్నారు. దీంతో బాధిత రైతు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయగా జాయింట్ కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించారు. సహకార శాఖ ఉన్నతాధికారుల ప్రమేయంతో రూ.లక్షల నగదు చేతులు మారిందనే ఆరోపణలతో విచారణ కొనసాగుతుంది.
ఏఐ సృష్టించిన చిత్రం
హద్దుల్లేని అవినీతి
సొసైటీల్లో స్వాహాపర్వం
రంగాపురం, టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెంలో అవకతవకలు
క్రిమినల్ చర్యలు, రికవరీలు శూన్యం
జిల్లా అధికారి వద్దే పెండింగ్‌లో ఫైళ్లు
రైతు ఫిర్యాదు మేరకు జేసీ విచారణ


