కారుమూరి సునీల్‌ అరెస్ట్‌ అన్యాయం | - | Sakshi
Sakshi News home page

కారుమూరి సునీల్‌ అరెస్ట్‌ అన్యాయం

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

కారుమూరి సునీల్‌ అరెస్ట్‌ అన్యాయం అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్‌ స్టౌవ్‌లు నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌ పంట బోదెలో మృతదేహం పెన్షనర్లకు జేఏసీ అండ

భీమవరం: అవినీతి మచ్చలేని మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తనయుడు సునీల్‌ను అరెస్ట్‌ చేయడం అన్యాయమని యా దవ సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల భానుప్రసాద్‌యాదవ్‌ అన్నారు. భీమవరంలో ఆదివారం యాదవ సంఘం ఆధ్వర్యంలో విలేక రుల సమావేశంలో మాట్లాడారు. యాదవులు స్వతహాగా సౌమ్యులు, నిజాయతీపరులన్నా రు. మంత్రిగా నాగేశ్వరరావు పేదలకు సేవలందించారని, సునీల్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి పాల్పడే అవకాశం లేదన్నారు. వ్యక్తిగత కక్షలతో వారి అభివృద్ధిని ఆపడం ద్వారా యాదవుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటానికి కుట్ర లు జరుగుతుంటే జిల్లా యాదవజాతి మొత్తం కారుమూరి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. సంఘ నాయకులు పేపేటి పెద్దిరాజు, గొరిపర్తి సత్యనారాయణ, పచ్చిగోళ్ల ఆంజనేయులు, కై లా పాండు, కోరశిక పెద్దిరాజు, కోరాశిక శ్రీనివాసరావు, కందుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలోని 1,626 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్‌ స్టౌవ్‌లు, వంట పాత్రల కిట్‌లను ఆదివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్యాస్‌ సిలిండర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇండక్షన్‌ స్టౌవ్‌లను అందజేసిందన్నారు. వీటి వినియోగంపై అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ అందించాలని ఐసీడీఎస్‌ పీడీని ఆదేశించారు. చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. ఐసీడీఎస్‌ పీడీ డి.శ్రీలక్ష్మి, సీడీపీఓలు లక్ష్మీకాంతం, వాణి విజయరత్నం, బ్లాక్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌ ప్రసాద్‌, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్‌, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమం కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజ లు ఆన్‌లైన్‌లోనూ అర్జీలు నమోదు చేసుకోవ చ్చని, టోల్‌ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చని ఆమె సూచించారు.

పెనుమంట్ర: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయానికి (పోలీస్‌స్టేషన్‌) సమీపంలో బ్రాహ్మణచెర్వు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పంట బోదెలో గుర్తుతెలియని మృతదేహాన్ని ఆదివారం ఉదయం గుర్తించినట్టు పెనుమంట్ర పోలీసులు తెలిపారు. వీఆర్వో నాగబాబు ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు సెల్‌ 9440796682 నంబర్‌కు తెలియజే యాలని కోరారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల పోరాటాలకు ఏపీ జేఏసీ అండగా ఉంటుందని ఏపీ ఎన్‌జీఓస్‌ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ హాల్‌లో ఏలూరు జిల్లా ఎస్‌జీపీఏ అడ్‌హక్‌ కమిటీ ఏర్పాటుకోసం నిర్వ హించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మా ట్లాడారు. అడ్‌హక్‌ కమిటీ ఏర్పాటు కోసం సూ చనలను చేసి భవిష్యత్‌లో జరిగే ఉద్యమాల్లో పెన్షనర్లు కూడా పాల్గొని జేఏసీకి తోడ్పాటు అందించాలని కోరారు. పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులొచ్చినా జేఏసీ, ఎన్‌జీఓస్‌ పరంగా అండగా ఉంటామన్నారు. ఏపీ ఎన్జీవోస్‌ అసో సియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరనాథ్‌ మా ట్లాడుతూ పెన్షనర్ల సంఘం ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement