వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే పంట కాలువలపై చెక్ డ్యామ్‌లు, షట్టర్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో సాగునీరు వృథాగా పోతోంది. కాళ్ల మండలంలో 10 గ్రామాలకు నీరందించే బొండాడ పంట కాలువపై ఎల్‌ఎన్‌పురం వద్ద చెక్‌డ్యామ్‌కు ఉన్న షట్టర్లు పూర్తిగా పాడయ్యాయి. అలాగే మెండి వద్ద చెక్‌డ్యామ్ గోడలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుని చెక్‌డ్యామ్‌లను పునరుద్ధరించడంతో పాటు కొత్త షట్టర్లు ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. దీనిపై ఉండి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ తోట ఫణిబాబును వివరణ కోరగా బొండాడ పంట కాలువను రైతుల ప్రోత్సాహంతో ప్రక్షాళన చేశామన్నారు. శిథిలావస్థకు చేరిన డ్యామ్, షట్టర్ల పునరుద్ధరణకు ప్రతిపాదనలు చేశామని చెప్పారు.
– కాళ్ల
ఎల్‌ఎన్‌పురం వద్ద షట్టర్లు ఇలా..


