యోగాతో ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

యోగాతో ఆరోగ్యం

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

యోగాతో ఆరోగ్యం

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రతిఒక్కరూ యోగాను అలవాటుగా చేసుకుని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం భీమవరం కలెక్టరేట్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. జిల్లావ్యాప్తంగా రెండు వారాలుగా యోగా అభ్యాస కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. భీమవరంలో సుమారు 1,500 మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. యోగా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో కలిసి జేసీ ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే రాష్ట్రస్థాయిలో జిల్లాకు ద్వితీయ స్థానం సాధించడంలో విశేష కృషి చేసిన జిల్లా అధికారులను సత్కరించారు. యోగా శిక్షకు డు, పీడీ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో యోగాసనాలు, ప్రాణాయామం, ధాన్యంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, డీఈఓ ఈ.నారాయణ, ఆయుష్‌ పీడీ శ్రీరామ్‌, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఏవీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

యోగాసనాలు వేస్తున్న జిల్లా అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement