కొయ్యలగూడెం: దేవదాయ శాఖ పరిధిలోని అక్రమంగా చెట్లను నరికిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆదివారం డిమాండ్ చేశారు. రాజవరం పంచాయతీ పరిధిలో ఆర్‌అండ్‌బీ, గూటాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భూముల్లో ఉన్న కొబ్బరి చెట్లు నరికివేశారన్నారు. గుట్టుచప్పుడు కాకుండా నరికేసి అనంతరం చెట్టును కూడా తొలగించారన్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ అధికారులకు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అధికారులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సదరు అధికారులు, చెట్లు నరికిన దుండగులు కుమ్మక్కు అయ్యారేమోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కొందరు గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు పీజిఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేస్తామని అన్నారు.


