సత్య కేంద్రాన్ని ధ్వంసం చేసిన టీడీపీ నేతలు | - | Sakshi
Sakshi News home page

సత్య కేంద్రాన్ని ధ్వంసం చేసిన టీడీపీ నేతలు

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

ఆగిరిపల్లి: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లిలో మాజీ గవర్నర్‌ కృష్ణకాంత్‌ చేతుల మీదుగా ప్రారంభించిన సత్య కేంద్రాన్ని గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. గ్రామంలో కుటుంబ తగాదాలు, గ్రామ సమస్యల పరిష్కారం కోసం 1993లో రాష్ట్రంలోనే మొదటిసారిగా కనసానపల్లిలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. దీనిపై గ్రామానికి చెందిన పచ్చ నేతల కన్ను పడింది. సత్య కేంద్రాన్ని పునర్నిర్మాణం చేస్తామంటూ గ్రామస్తులను సంప్రదించకుండానే ఆదివారం ఉదయం ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement