సునీల్‌ అరెస్టు బీసీలపై కక్ష సాధింపే | - | Sakshi
Sakshi News home page

సునీల్‌ అరెస్టు బీసీలపై కక్ష సాధింపే

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

సునీల్‌ అరెస్టు బీసీలపై కక్ష సాధింపే సునీల్‌కుమార్‌ అరెస్ట్‌ దారుణం

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు

పాలకొల్లు సెంట్రల్‌: కూటమి పాలన అరాచకాలను ప్రశ్నిస్తుందన్న అక్కసుతోనే కారుమూరి సునీల్‌ కుమార్‌ను అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు మండిపడ్డారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా ఇలా కేసులు పెట్టి ప్రతిపక్షాల నోరు నొక్కాలని చూస్తుందన్నారు. ఎలాంటి కేసులు బనాయించినా ప్రభుత్వ తీరును ఎండగడతామని కేసులకు బెదిరేది లేదన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ నాయకులను ఏదో ఒకరకంగా ఇరికించాలనే ఉద్దేశంతో మద్యం స్కాం అంటూ కట్టుకథలు అల్లుతూ బీసీ నాయకులను టార్గెట్‌ చేస్తున్నారన్నారు. లాకప్‌ డెత్‌లు, చిన్నారుల మిస్సింగ్‌ కేసులు చేధించలేని కూటమి నేతలు ప్రజల నుంచి తమ తప్పులను కాపాడుకోవడానికి ఇలాంటి కేసుల్లో ఇరికించి పైశాచికానందం పొందుతున్నారన్నారు.

భీమవరం: కారుమూరి సునీల్‌కుమార్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్‌ అన్నారు. శనివారం భీమవరం 31వ వార్డు దళిత ఐక్యవేదిక జిల్లా ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును టార్గెట్‌ చేయడంలో భాగంగానే సునీల్‌కుమార్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement