కక్ష సాధింపు మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపు మానుకోవాలి

Jun 20 2026 12:30 PM | Updated on Jun 20 2026 12:30 PM

కక్ష సాధింపు మానుకోవాలి

బుట్టాయగూడెం: ఏలూరు పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్‌ అక్రమ అరెస్ట్‌ను పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం బుట్టాయగూడెం పార్టీ కార్యాలయం వద్ద విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న నాయకులను కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లు చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైఎస్సార్‌సీపీ నాయకులను చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్‌ చేయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయపు అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. వాటి కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులూ పెట్టి అరెస్ట్‌లు చేస్తున్నారని అన్నారు. అక్రమ అరెస్ట్‌లకు అదరం, బెదరం అని అన్నారు. బీసీల ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అణగదొక్కాలని చూస్తుందన్నారు. బీసీలు తిరగబడి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement