న్యూస్‌రీల్
నాడు అండగా.. నేడు భరోసాగా..
‘హైస్కూల్ ప్లస్’.. నిర్వీర్యం
ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉపాధ్యాయుల అశ్రద్ధ వెరసి గ్రామీణ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ‘హైస్కూల్ ప్లస్’ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. 8లో u
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: విదేశీ మారకద్రవ్యంతో దేశానికి ఆదాయం తెస్తున్న ఆక్వా రైతులు రోడ్డున పడుతున్నారు. రొయ్య ధరలు గిట్టుబాటవ్వక సాగు భారమై దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. సిండికేటు దోపిడీని అడ్డుకోవాలని ఏడాదిన్నర కాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ తరుణంలో మేత ధరలు తగ్గించకుంటే రైతుల పక్షాన ఆందోళనకు సిద్ధమంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేయడం ఆక్వా రైతులకు కొండంత ధైర్యాన్నిస్తోంది. 2.63 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం, ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల దిగుబడితో రొయ్యల ఉత్పత్తిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. కిలోకు 30 నుంచి 40 కౌంట్‌లోపు రొయ్యలు అమెరికాకు, 50 నుంచి 100 కౌంట్ వరకు రొయ్యలు చైనా, యురోపియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏటా ఆక్వా ఎగుమతులతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది.
రైతులు విలవిల
జోన్‌తో నిమిత్తం లేకుండా ఆక్వా రైతులందరికీ రూ.1.50 రాయితీ విద్యుత్ ఇస్తానని, కోల్డ్ స్టోరేజిలు కట్టిస్తానని, ఏరియేటర్స్‌పై సబ్సిడీ ఇస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అవేమీ చేయకపోగా ప్రస్తుతం ఇస్తున్న రాయితీ విద్యుత్‌కు పవర్ ఫ్యాక్టర్ పేరిట ఎగనామం పెట్టే పనిలో ఉన్నారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్టర్స్ సిండికేటు టీడీపీకి చెందిన వారే కావడంతో కూటమి పాలనలో దోపిడీకి తెరలేచింది. ఏకపక్షంగా మేత ధరలు పెంచి, రొయ్య రేట్లు తగ్గించి రైతుల కష్టాన్ని కాజేస్తున్నారు. గత ఏడాది అమెరికా పన్నుల పెంపు ప్రకటనను సాకుగా చూపించి కౌంట్‌కు రూ.30 నుంచి రూ.70 వరకు తగ్గించేశారు. పన్నుల పెంపులేదని అమెరికా చెప్పినా తగ్గించిన రొయ్య రేట్లు పెంచలేదు. సిండికేట్ దోపిడీ, కూటమి సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అప్పట్లో జిల్లా అంతటా రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. నరసాపురం, పాలకొల్లు, ఆచంటలో చెరువులను ఎండగట్టి పంట విరామానికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం ఉండిలో ఆక్వా సదస్సు, విజయవాడలో ప్రాన్ కో–ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పేరిట కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది. తాజాగా నెలరోజుల క్రితం మేత ధరలు పెంచుతున్నట్టు ఫీడ్ కంపెనీల ప్రకటనతో రైతులు మళ్లీ రోడ్డెక్కి మేత బస్తాలను తగలబెట్టారు. తాము చెప్పే వరకు ధరలు పెంచవద్దని కంపెనీలకు సూచించినట్టు ప్రభుత్వం చెప్పింది. అయితే టన్నుకు రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు ఫీడ్ కంపెనీలు ధరలు పెంచేయడం గమనార్హం. మరోపక్క రొయ్య ధరలు కౌంట్‌కు రూ.30 నుంచి రూ.50 వరకు తగ్గించేశారు. ఇప్పటికే పాలకొల్లు, వీరవాసరం, ఉండి, భీమవరంలలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. మేత ధరల పెంపుతో ఎకరాకు రూ.35 వేలు వరకు అధనపు భారం పడుతుండగా, రొయ్య ధరల పతనంతో రూ. లక్ష వరకు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.
రొయ్య ధరలు తగ్గించి.. మేత ధరలు పెంచి సిండికేటు దోపిడీ
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
రెండేళ్లుగా నష్టాల్లో ఆక్వా సాగు
దిక్కుతోచక రోడ్డెక్కుతున్న రైతులు
ధర్నాలు, ఉరితాళ్లతో నిరసనలు
ఆక్వాకు నాడు అండగా.. నేడు భరోసాగా వైఎస్సార్ సీపీ
సర్కారుకు జగన్ అల్టిమేటం పట్ల రైతుల హర్షం
ఆక్వా రంగానికి అడుగడుగునా అండగా నిలిచారు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రపంచంలోనే రెండవదిగా ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్‌మెంట్ ఆథారిటీ (అప్సడా)ని ఏర్పాటుచేశారు. యూనిట్ విద్యుత్ రూ.1.50తో పాటు ఇతర రాయితీలు అందించారు. ఆక్వా కంపెనీలను రైతులకు జవాబుదారీ చేసి మేత, రొయ్య ధరల స్థిరీకరణ, నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరాకు కృషిచేశారు. కరోనా సమయంలో సైతం సిండికేట్ దోపిడీకి కళ్లెంవేసి 100 కౌంట్ రూ.180 ఎంఎస్‌పీగా నిర్ణయించి అమలుచేశారు. రొయ్యల ఉత్పత్తి, ఎగుమతుల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపారు.
కూటమి పాలనలో సిండికేట్ దోపిడీతో కుదేలవుతున్న ఆక్వా రైతులకు నేడు భరోసాగా నిలుస్తున్నారు వైఎస్ జగన్. ఎప్పటికప్పుడు రైతుల ఆందోళనలకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ వారి పక్షాన పోరాడుతోంది. పెంచిన మేత ధరలు తగ్గించకుంటే జూలై 1 లేదా 2 తేదీల్లో రైతులతో కలిసి ఆందోళన చేపడతానని జగన్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం తమకు కొండంత భరోసానిస్తోందని ఆక్వా రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.


