భీమవరం: సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల అలసత్వం వద్దని, వారికి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీసుస్టేషన్స్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో పోలీస్ శాఖను ఆశ్రయిస్తారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.


