ఐజీ అశోక్‌కుమార్
ఏలూరు టౌన్: పోలీస్ వ్యవస్థలో నిందితులకు శిక్షలు విధించడంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాధనాలు కీలకమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అధ్యక్షతన పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్‌ను శనివారం ఏలూరులో నిర్వహించా రు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఐజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ పోలీస్ విధుల్లో ద ర్యాప్తు, కోర్టు విచారణల రిపోర్టుల తయారీలో ఏఐ ఉపయోగపడుతుందన్నారు. ఏలూరు జిల్లాలో ఎస్పీ శివకిషోర్ ఆధ్వర్యంలో ఏఐని వినియోగిస్తూ మెరుగైన ఫలితాలు సాధించటం అభినందనీయమని, ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో ఏఐ టూల్స్‌ను వినియోగించాలన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ ధర్మా (డిజిటల్ హాలీస్టిక్ ఏఐ డ్రైవెన్ రెస్పాన్స్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్) యా ప్‌ను రూపొందించటంలో స్మార్ట్ పోలీసింగ్‌కు కృషి చేశామన్నారు. ధర్మా యాప్ పోలీస్ విధి నిర్వహణలో ఏఐ ఆధారిత సహాయక వేదికగా పనిచేస్తోందన్నారు. గతంతో పోలిస్తే కేసుల పరిష్కారం 20 శాతం పెరిగిందన్నారు.


