జిల్లాలో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటైన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, యువత సహకారం చాలా గొప్పగా ఉంది. వివిధ శాఖల ఉద్యోగులు క్యాంపుల ద్వారా రక్తాన్ని అందిస్తూ సకాలంలో ప్రాణాలు రక్షించడంలో భాగస్వాములవుతున్నారు.
– డాక్టర్ రామభద్రరాజు (రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్, భీమవరం)
వైఎస్సార్ జయంతి, వైఎస్ జగన్ పుట్టినరోజుల సందర్భంగా ఏడాదికి రెండు సార్లు బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. కార్యకర్తలు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి సోషల్ మీడియా ద్వారా దాతలను సమకూరుస్తున్నాం.
– చిగురుపాటి సందీప్, వైసీపీ జిల్లా యువజన అధ్యక్షుడు


