ధ్వంసమైన క్యూలైన్ల పైకప్పు | - | Sakshi
Sakshi News home page

ధ్వంసమైన క్యూలైన్ల పైకప్పు

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

ధ్వంసమైన క్యూలైన్ల పైకప్పు రైతుకు మేలు చేయాలి షరతులు లేకుండా ఇవ్వాలి

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం నూతన అనివెట్టి మండపం పక్కన క్యూలైన్లలోని పైకప్పు ఈదురుగాలులకు ధ్వంసమైంది. గురువారం మరమ్మతులు చేపట్టారు.

ఆక్వా రైతుకు ఇచ్చే విద్యుత్‌ సబ్సిడీలో కొరివి పెట్టకుండా, ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకూ న్యాయం చేయాలి. గతంలో కూడా ఇలానే ఆక్వా రైతులకు హామీలు ఇచ్చినా రెండేళ్లలో అమలు చేయలేదు. ఇప్పుడు ఇదేదో ఆక్వా మేతలు పెంచుకునేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ లాగా ఉంది తప్ప ఆక్వా రైతుకు మేలు జరిగేలా లేదు.

–పెనుమత్స దుర్గాప్రసాద్‌రాజు, ఆక్వా రైతు

ఆక్వా రైతులకు ఎటువంటి షరతుల లేకుండా విద్యుత్‌ సబ్సిడీ అందించాలి. అసలే ఫీడు, సీడు ధరలు పెరిగి నష్టాల బారిన పడుతున్నాం. ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన తరుణంలో ప్రభుత్వ పవర్‌ ఫ్యాక్టర్‌ అంటూ ఏదో చెబుతున్నారు. ఆక్వా రైతులను నిష్పక్షపాతంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రూ.1.50కే సబ్సిడీ విద్యుత్‌ను అందించాలి.

– కర్రి వెంకటేశ్వరరెడ్డి, ఆక్వా రైతు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement