కాళ్ల: ఆకివీడు శివారు ఐ.భీమవరం రోడ్డులో ఉన్న దుంపగడప పంట బోదెలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనుగొన్నట్లు ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజు మంగళవారం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం పంట బోదెలో 35 సంవత్సరాల వయసు ఉన్న పురుషుని మృతదేహం బోర్లా పడి ఉండడాన్నీ కనుగొన్నామన్నారు. నీలిరంగు ఫ్యాంటు, గోధుమ రంగు చారలు షర్టు కలిగి ఉన్నారని ఆయన వివరించారు. వెంకయ్య–వయ్యేరు కాలువలో నీటి ప్రవాహంలో కొట్టుకుని వచ్చి పంట బోదెలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
కామవరపుకోట: మండలంలో అంకాలంపాడు, కామవరపుకోట కోత్తూరు పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి పొలాల్లో బోరు మోటర్ కేబుల్ వైర్లు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించి వెళ్లినట్లు రైతులు తెలిపారు. దీనిపై మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ వైర్లు సుమారు రూ.2 లక్షల రూపాయలు పైగా ఉంటుందని రైతులు తెలిపారు. గతంలో కూడా ఇలాగే ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు, మోటర్ వైర్లు దొంగతనానికి గురైనట్లు రైతులు పేర్కొన్నారు.


