జంగారెడ్డిగూడెం: చెస్ డెవలప్‌మెంట్ అండ్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని ఇండియన్ డిజిటల్ స్కూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–11 ఓపెన్ బాలబాలికల చదరంగ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ పోటీల ద్వారా ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 9, 10 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్–11 ఛాంపియన్‌షిప్‌లో ఏలూరు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాలుర విభాగంలో జ్యోతి స్వరూప్ మొదటి స్థానం, హరి విహాన్ రెండో స్థానం సాధించగా, బాలికల విభాగంలో ధరణి మొదటి స్థానం, బిస్మి యాస్మిన్ జారా రెండవ స్థానం సాధించారు అని టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ పాలూరి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ మహేష్, ఏలూరు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ పాలూరి, కార్యదర్శి కన్నా సూర్య నాగేశ్వరరావు పాల్గొన్నారు.


