ఉత్తమ ప్రదర్శనగా ‘అగ్నిసాక్షి’ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ప్రదర్శనగా ‘అగ్నిసాక్షి’ ఎంపిక

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

ఉత్తమ ప్రదర్శనగా ‘అగ్నిసాక్షి’ ఎంపిక

భీమవరం: పట్టణంలో కళారంజని నాటక అకాడమి 15వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీల్లో చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి ‘అగ్నిసాక్షి’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా బహుమతి అందుకుంది. పోటీల్లో విజేతల వివరాలను బుధవారం పోటీల న్యాయనిర్ణేత గంటా ముత్యాలరావునాయుడు విలేకర్లకు తెలిపారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా శ్రీరమణకళానిలయం గుంటూరు వారి ‘మాతృత్వం’ ఎంపికై ంది. ఉత్తమ నటులుగా ఫొటో నాటికలోని సోములు పాత్రధారి చిల్లర సుబ్బారావు, అందరూ మంచివారే కానీ.. నాటికలో సౌజన్య పాత్రధారిణి సురభి పూజిత, మాతృత్వం నాటికలో సంతోష్‌ పాత్రధారి పొగర్తి నాగేశ్వరరావు, మరో పుత్తడిబొమ్మ నాటికలో కమల పాత్రధారిణి అమృతవర్షిణి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా బాలాజీ నాయక్‌, ఉత్తమ రచయితగా జరుగుల రామారావు, ఉత్తమ సంగీత దర్శకుడిగా లీలామోహన్‌ ఎంపికయ్యారు. ఉత్తమ ఆహార్యం ఇవి కదా ముగింపు నాటిక, ఉత్తమ రంగాలంకరణకు అందరూ మంచివారే కానీ.. నాటికకు లావు అనిల్‌చౌదరి, జ్యూరీ అవార్డులను ఇది కదా ముగింపు నాటికలో వై వాసు, యశోద కై వసం చేసుకున్నారని ముత్యాలరావునాయుడు చెప్పారు. కార్యక్రమంలో అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు జవ్వాది దాశరధీ శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి మెంటే పూర్ణచంద్రరావు, కార్యదర్శి మల్లుల సీతారామప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement