దొంగను పట్టించిన సీసీ కెమెరాలు | - | Sakshi
Sakshi News home page

దొంగను పట్టించిన సీసీ కెమెరాలు

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

కై కలూరు: బంగారు దుకాణాలే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి సీసీ కెమెరాల సాయంతో కై కలూరు టౌన్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిపై ఆంధ్రా, తెలంగాణల్లో పలు కేసులు ఉన్నాయన్నారు. పట్టణ సీఐ ఏవీఎస్‌.రామకృష్ణ, టౌన్‌ ఎస్సై డీ.వెంకట్‌కుమార్‌ బుధవారం సర్కిల్‌ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన కై కలూరు కన్యకాపరమేశ్వరీ అమ్మవారి దేవస్థాన సమీపంలో గుర్రం సత్య వినోద్‌కు చెందిన బంగారు దుకాణంలో పశ్చిమగోదావరి జిల్లా, ఆకివీడు మండలం ఐ.భీమవరంనకు చెందిన గొర్రెల సత్యనారాయణ(37) అనే వ్యక్తి పట్టపగలు కట్టర్‌తో గేట్లు పగలగొట్టడానికి ప్రయత్నించాడు. సమీప వ్యక్తి యజమానికి ఫోన్‌ చేయడం గమనించి పరారయ్యాడు. దీంతో యజమాని ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖానికి మాస్క్‌, తలకు టోపీ పెట్టుకున్న నిందితుడిని సీసీ కెమెరాల సాయంతో గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిపై ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో పలు బంగారపు దుకాణాల చోరీ కేసులు ఉన్నాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement