భీమవరం: భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశాజ్యోతి బీఆర్ అంబేడ్కర్ అందరివాడని, అన్నివర్గాల్లోని పేదల అభ్యున్నతికి కృషిచేశారని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. భీమవరం పట్టణం గునుపూడి గురువుపేటలో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మంగళవారం రాత్రి ఆయన ఆవిష్కరించారు. భీమవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చినిమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్, ఎంబీసీ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న, వైఎస్సార్‌సీపీ నాయకులు కామన నాగేశ్వరరావు, చిగురుపాటి సందీప్, గాదిరాజు రామరాజు, కాటం స్టాలిన్, బోకూరి విజయరాజు తదితరులు పాల్గొన్నారు.


