ఇండస్ట్రియల్‌ పార్కులపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రియల్‌ పార్కులపై అవగాహన అవసరం

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

ఇండస్ట్రియల్‌ పార్కులపై అవగాహన అవసరం

భీమవరం: ప్రైవేట్‌ ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సదుపాయాల కల్పనపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు, భూస్వాములు, రైతులతో ఎంఎస్‌ఎంఇ పార్క్‌ పాలసీపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. భూ యజమానులు తమ భూములను రియల్‌ ఎస్టేట్‌కు విక్రయించడం కంటే పారిశ్రామికాభివృద్ధికి వినియోగిస్తే వారికి దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని, ఎంఎస్‌ఎంఇ పార్కులు ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఏర్పడతాయన్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు మాట్లాడుతూ యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్డీవో కె.ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం యు.మంగపతి రావు, వ్యవసాయ శాఖాధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

బాధితులకు తక్షణ ఉచిత వైద్యం

భీమవరం (ప్రకాశంచౌక్‌): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీపీఎం–రాహత్‌శ్రీ పథకం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. ఈ పథకం అమలుపై ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement