మనసు దోచే జలపాతాలు
పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేయాలి
మనసు దోచే అందాలు
● పశ్చిమ మన్యంలో ఆకట్టుకుంటున్న అందాలు
● వైఎస్సార్‌సీపీ పాలనలో రోప్ వే బ్రిడ్జిల కోసం రూ.60 లక్షల కేటాయింపు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అనేక అద్భుత జలపాతాలు ఉన్నాయి. బయట ప్రపంచానికి తెలిసినవి కొన్ని మాత్రమే ఉండగా తెలియనివి అనేకం ఉన్నాయి. ప్రకృతి ప్రేమికుల మదిని దోచే కొండకోనలు ఈ ప్రాంతం సొంతం. ప్రభుత్వాలు, పాలకులు ఈ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆదాయంతోపాటు స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
మన్యంలో అద్భుత జలపాతాలు
బుట్టాయగూడెం మండలం ముంజులూరు సమీపంలో ఏనుగుతోగు జలపాతం, ఉప్పరిల్ల జలపాతం, పాపికొండల అభయారణ్యంలో జలతారు వాగు జలపాతాలు బయట ప్రపంచానికి తెలిసినవి. ఈ జలపాతాలకు వారాంతంలో, పండుగల పర్వదినాల్లో పర్యాటకులు తరలివస్తారు. బయట ప్రపంచానికి తెలియని అనేక జలపాతాలు ఉన్నాయి. గిన్నేపల్లి, గడ్డపల్లికి మధ్యలో సాగరాల వాటర్‌ఫాల్స్, పోలవరం మండలం రెడ్డికుంకాల సమీపంలోని జలపాతంతో పాటు అటవీ ప్రాంతంలో అనేక జలపాతాలు ఉన్నాయి.
పర్యాటక ప్రదేశాల్లో కనిపించని అభివృద్ధి
ఏజెన్సీ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలకు వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చి సందడి చేస్తున్నప్పటికీ ఆయా ప్రదేశాల్లో ఎలాంటి అభివృద్ధి లేదు. దీంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళా పర్యాటకుల ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రభుత్వం, పాలకులు పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.
రోప్ వే బ్రిడ్జిల ఏర్పాటుకు నిధుల మంజూరు
బుట్టాయగూడెం మండలం మారుమూల అటవీప్రాంతంలో ఉన్న ఏనుగుతోగు జలపాతానికి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ముంజులూరు శివారు నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. రహదారి వెంట పచ్చని చీర పరిచినట్లుగా అడవి తల్లి అందాలు కనువిందు చేస్తుంటాయి. రహదారి పొడవునా ఒకే కొండకాల్వ 9 సార్లు కనిపిస్తుంది. ఈ కాల్వపై సుమారు 9 రోప్ వే బ్రిడ్జిల ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సుమారు రూ.40 లక్షలు మంజూరు చేసింది. జలపాతం సమీపంలో మహిళలు దుస్తులు మార్చుకోవడానికి రూంలు, మరుగుదొర్ల ఏర్పాటుకు మరొక రూ.20 లక్షలు మంజూరు చేసింది. టెండర్‌లు పిలిచే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో ఆ పనులు నిలిచాయి.
పశ్చిమ మన్యం ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రభుత్వం, పాలకులు కృషి చేయాలి. ఈ ప్రదేశాలను చూసేందుకు ఇప్పటికే వేలాదిమంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.
షేక్ ముత్తూ సాహెబ్, పులిరాముడుగూడెం, బుట్టాయగూడెం మండలం
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో మనసు దోచే జలపాతాలతోపాటు ఎల్తైన కొండలు, అడవితల్లి అందాలు, పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తాయి. ఈ ప్రాంతానికి సెలవురోజుల్లో, ప్రతి ఆదివారం అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. వీటిని అభివృద్ధి చేసి వసతులు కల్పిస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు ఈ ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. కొండేపాటి రామకృష్ణ బుట్టాయిగూడెం
మనసు దోచే జలపాతాలు
మనసు దోచే జలపాతాలు
మనసు దోచే జలపాతాలు
మనసు దోచే జలపాతాలు
మనసు దోచే జలపాతాలు


