మామిడి పూతకు మంచు దెబ్బ | - | Sakshi
Sakshi News home page

మామిడి పూతకు మంచు దెబ్బ

Jan 19 2026 4:05 AM | Updated on Jan 19 2026 4:05 AM

మామిడ

మామిడి పూతకు మంచు దెబ్బ

తేనె మంచు పురుగు నివారణ ఇలా

చింతలపూడి: ప్రతికూల ప్రభావంతో ఈ ఏడాది మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. మండలంలో ఒక ప్రాంతంలో పూతలు బాగుంటే, మరో ప్రాంతంలో ఎక్కడా పూత కనిపించడం లేదు. ఈ పరిస్ధితుల్లో పూత పూసిన ప్రాంతంలో మామిడి పంట మంచు దెబ్బకు విలవిల్లాడుతూంది. గత రెండు, మూడేళ్ళుగా ధర ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది రైతులు మామిడి పంటపై గంపెడాశతో ఉన్నారు. సంవత్సరం అంతా సస్యరక్షణ చేపట్టి పంటను కాపాడుకుంటూ వస్తుంటే మంచు కారణంగా పూత, పిందె మాడిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ద్వితీయ స్ధానం, జిల్లాలో ప్రథమ స్థానం ఆక్రమించి విదేశాలకు సైతం ఎగుమతి చేసిన మామిడి పంటకు నియోజకవర్గంలో గడ్డు కాలం ఏర్పడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దశాబ్దాల పాటు కన్నబిడ్డల్లా కాపాడుకుంటూ వస్తున్న మామిడి తోటలను రైతులు గత్యంతరం లేక గత కొద్ది సంవత్సరాలుగా తొలగిస్తున్నారు. గతంలో నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడి తోటలు క్రమక్రమంగా 10 వేల ఎకరాలకు తగ్గిపోయాయి. ప్రస్తుతం చింతలపూడి, టి.నరసాపురం, కామవరపుకోట, లింగపాలెం మండలాల్లో మాత్రమే తోటలు ఉన్నాయి. మామిడి తోటల అభివృధ్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు ప్రోత్సాహం అందించక పోతే భవిష్యత్తులో మామిడి అంతరించిపోయే ప్రమాదం ఉంది.

సస్యరక్షణ చేపట్టాలి

ఈ సంవత్సరం వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా మామిడి తోటలు పూయలేదని అధికారులు చెబుతున్నారు. నెల రోజులుగా వాతావరణం పొడిగా ఉన్నందున గత 10 రోజులుగా తోటల్లో పూత కనపడుతోంది. రైతులు ఇప్పట్నించీ సరైన సస్య రక్షణ చేపట్టాలి. 5 గ్రాముల పొటాషియం నైట్రేట్‌ లేదా 50 గ్రాముల యూరియా లీటరు నీటిలో కలిపి చెట్లకు స్ప్రే చేయాలి.

ప్రస్తుతం మామిడి పూతపై తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది. లేత పూ మొగ్గలు ప్రారంభంలో తేనె మంచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్‌(కాన్ఫిడార్‌) ద్రావణం 10 లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. లేదా ధయో మిటాక్జిమ్‌ 10 లీటర్ల నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేస్తే పురుగు ఉధృతి తగ్గుతుంది.

ఎండి షాఫియ ఫర్హీన్‌–ఉద్యానాధికారి , చింతలపూడి

మామిడి పూతకు మంచు దెబ్బ 1
1/3

మామిడి పూతకు మంచు దెబ్బ

మామిడి పూతకు మంచు దెబ్బ 2
2/3

మామిడి పూతకు మంచు దెబ్బ

మామిడి పూతకు మంచు దెబ్బ 3
3/3

మామిడి పూతకు మంచు దెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement