హోరాహోరీగా కబడ్డీ పోటీలు
నరసాపురం: నరసాపురం రుస్తుంబాధలో గోగులమ్మ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో జరుగుతున్న 33వ జాతీయస్థాయి మహిళలు, పురుషులు ఇన్విటేషన్ కప్ కబడ్డీ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. లీగ్‌కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ పోటీల్లో జట్లు హోరాహోరీగా తలపపడుతున్నాయి. శుక్రవారం వరకూ జరిగిన పోటీల్లో ఇరు విభాగాల్లోను ఆంధ్రా జట్లు వెనకంజలో ఉండటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. మహిళలకు, పురుషులకు స్టేడియంలో రెండు వేర్వేరు కోర్టులు ఏర్పాటు చేసి పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఫ్టడ్‌లైట్ల వెలుగులో నిర్వహిస్తోన్న పోటీలకు ప్రేక్షకులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ సీఈవో వీ.వీర్లెంకయ్య, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పద్మజాబాల, రిఫరీస్ ఇన్‌చార్జ్ కె.బాలు, గుగ్గిలపు మురళి, వన్నెంరెడ్డి శ్రీనివాస్ పోటీలు పర్యవేక్షిస్తున్నారు. రెండు విభాగాల్లోనూ కలపి గెలుపొందిన జట్లకు మొత్తం రూ 7.50 లక్షలు ప్రైజ్‌మనీ అందించనున్నారు.
మ్యాచ్‌ల ఫలితాలు ఇలా..
పురుషుల విభాగంలో ఢిల్లీ జట్టు, హర్యానాపై 19 ఫాయింట్ల తేడాతో, రాజస్థాన్ జట్టు జమ్మూ అండ్ కశ్మీర్ పోలీస్ జట్టుపై 16 పాయింట్ల తేడాతో, హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో బాబా హరిదాస్ హర్యానా జట్టు ఢిల్లీ జట్టుపై 3 పాయింట్ల తేడాతో, రాజ్‌కోట్ రెడ్‌బుల్స్ జట్టు ఫదీరాబాద్ జట్టుపై 6 పాయింట్ల తేడాతో, రాజస్థాన్‌జట్టు ఆంధ్రా జట్టుపై 7 పాయింట్ల తేడాతో గెలుపొందాయి. మహిళల విభాగంలో తమిళనాడు జట్టు ఆంధ్రా జట్టుపై 19 పాయింట్ల తేడాతో, బాబా హరిదాస్ హర్యానా జట్టు కేరళ జట్టుపై 12 పాయింట్ల తేడాతో, మరో మ్చాలో హిమాచల్‌ప్రదేశ్ జట్టు హర్యానాపై 3 పాయింట్ల తేడాతో, ఏకపక్షంగా సాగిని మరో మ్యాచ్‌లో సీఆర్‌ఫీఎఫ్ ఢిల్లీ జట్టు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్‌జట్టుపై 40 పాయింట్ల తేడాతో గెలుపొందాయి. హర్యానా జట్టు ఆంధ్రాజట్టుపై 14 పాయింట్ల తేడాతో గెలుపొందాయి.
ఇరు విభాగాల్లోనూ వెనుకంజలో ఆంధ్రా జట్లు


