రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు
ఆకివీడు: సంక్రాంతి యువజనోత్సవాలు సందర్భంగా డీవైఎఫ్‌ఐ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర స్థాయి పోటీలకు 10 టీమ్‌లు హాజరుకాగా, ఆకివీడు, ఆరుగురు బుడ్డోళ్లు, కమతవానిగూడెం, కై కలూరు, వరదళ్లపాడు టీములు తలబడ్డాయి. శనివారం నుండి రాష్ట్ర స్థాయి టీములు తలబడనున్నాయి. కాగా సంక్రాంతి యువజనోత్సవాల్లో గత రెండు రోజులుగా జరిగిన జిల్లా చెస్ పోటీల్లో ప్రథమ గంటా కీర్తి, ద్వితియ సీహెచ్.వివేక్(ఏలూరు), తృతియ జోషిత్ వర్మ(భీమవరం) విజయం సాధించారు. మూడు జిల్లాల స్థాయి క్రికెట్‌పోటీల్లో విన్నర్స్‌గా పట్టి లెవెల్స్, రన్నర్స్‌గా దుంపగడప టీములు విజయం సాధించాయి. జిల్లా స్థాయి పాటల పోటీల్లో రెడ్డి అప్పారావు, నెల్లి బాలాదిత్య, షేక్ పరహాన్‌లు విజయం సాధించారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ శుక్రవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా అర్చకులు, పండితులు ఘన స్వాగతం పలికారు. ప్రదక్షిణల అనంతరం ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఆ తరువాత ఆలయ ఆవరణలో దేవస్థానం సిబ్బంది, అర్చకులు, పండితులు వినాయక్‌తో కాసేపు ముచ్చటించారు.
భీమవరం: భీమవరం రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో భీమవరం–ఉండి మధ్య పేరు తెలియని సుమారు నాలుగేళ్ల వయస్సు కలిగిన బాలికను గుర్తు తెలియని రైలు ఢీ కొనడంతో మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. బాలిక మృతదేహంపై మొలతాడు, ఎడమ కాలికి గాలి తాడు ఉన్నాయని ఉండి రైల్వేస్టేషన్ మాస్టారు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాలిక వివరాలు తెలిసినవారు 99084 48729 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
జంగారెడ్డిగూడెం: మండలంలోని లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి లక్కవరం ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడేనికి చెందిన గాది వెంకట దుర్గారావు (35) తన ఇంటి నుంచి నిమ్మలగూడెం మోటార్ సైకిల్‌పై వెళుతున్నాడు. ఆ సమయంలో ఎదురుగా మరో మోటార్ సైక్లిస్ట్ వచ్చి ఢీకొన్నాడు. దీంతో దుర్గారావుకు తలపై తీవ్ర గాయమైంది. వెంటనే అతనిని విజయవాడ తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
ఆకివీడు: నగర పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి పంపింగ్ హౌస్ నిలువుటద్దంగా ఉంది. స్థానిక వెంకయ్య వయ్యేరు నుంచి ఆనాల చెరువు లోకి నీరు నింపే పంపు హౌస్ వద్ద పైపు పగిలిపోవడంతో తోడిన నీరు మళ్లీ కాలువలోకే చొచ్చుకుపోతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ నగర పంచాయతీ వాటర్ వర్‌ుక్స అధికారులు, సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. నీటి తోడకం నిర్లక్ష్యంగా జరగడంతో విద్యుత్ బిల్లులు, మోటార్ వినియోగ నష్టానికి గురికావాల్సి వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై నగర పంచాయతీ సిబ్బందికి తెలియజేసినా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు.
రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు
రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు
రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు


