త్వరలో ‘వాయుపుత్ర’ విడుదల
పాలకోడేరు: త్వరలో వాయుపుత్ర సినిమా విడుదల కానుందని సినీ దర్శకుడు చందు మొండేటి అన్నారు. మండలంలోని గొరగనమూడిలో జరిగిన మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. గ్రామ దేవతల ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సితార ఎంటెర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్న వాయుపుత్ర చిత్రం విడుదలకు సిద్ధం కానుందని, తాను గతంలో తీసిన కార్తికేయ, కార్తికేయ–2, ప్రేమమ్, తండేల్ చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించడం ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతి సందర్భంగా తన స్నేహితుడు మాజీ సర్పంచ్ చెల్లబోయిన పాపారావు, మిత్రులను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన వెంట సర్పంచ్‌లు గొట్టుముక్కల శివాజీరాజు, బొల్లా శ్రీనివాస్, జంగం సూరిబాబు, పెన్నాడ మాజీ సర్పంచ్ ఇట్టా సురేష్‌బాబు తదితరులు ఉన్నారు.
జంగారెడ్డిగూడెం : స్థానిక ఏరియా ఆసుపత్రిలో వైద్యురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు తెల్లం శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్.వి ప్రసాద్ తెలిపారు. గురువారం బుట్టాయగూడేనికు చెందిన కారం శేఖర్ కోడి పందేల్లో గాయపడ్డాడు. అతనిని తీసుకుని బుట్టాయగూడెం జెడ్పీ హెస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న తెల్లం శ్రీనివాసరావు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆసుపత్రి వైద్యురాలు ఎస్.దీప్తి వైద్యం చేస్తుండగా తెల్లం శ్రీనివాసరావు వైద్యురాలిపై అసభ్యంగా ప్రవర్తించి డాక్టర్ వ్యక్తిగత రూంలోకి ప్రవేశించి వీడియో తీసినట్లు తెలిపారు. దీనిపై డాక్టర్ దీప్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎసై తెలిపారు.


