సార్లు.. ఇవిగో బరులు | - | Sakshi
Sakshi News home page

సార్లు.. ఇవిగో బరులు

Jan 13 2026 7:20 AM | Updated on Jan 13 2026 7:20 AM

సార్ల

సార్లు.. ఇవిగో బరులు

హెచ్చరికలు బేఖాతరు

ఏలూరులో జోరుగా..

క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. న్యాయస్థానం ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలు పందేల నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పండుగల్లో పెద్ద ఎత్తున కోడిపందేలు, జూదాల నిర్వహణకు జిల్లా అంతటా ఏర్పాటుచేస్తున్నారు. భీమవరం పరిసరాల్లోని డేగాపురం, పెదఅమిరం, సీసలి, మహదేవపట్న ం, వీరవాసరం, అలాగే తాడేపల్లిగూడెంలోను, తణుకులోని ఉండ్రాజవరం, పాలకొల్లు రూరల్‌ పూలపల్లి, వడ్లవానిపాలెం, ఆచంటలోని వడలి, దొంగరావిపాలెం తదితరచోట్ల పెద్ద బరులు సిద్ధం చేస్తున్నారు. కొన్నిచోట్ల రెండు మూడు వరకు పెద్ద, చిన్న బరులు ఏర్పాటుచేస్తున్నారు. భారీ సెట్టింగ్‌లతో సిద్ధం చేస్తున్న కొన్ని బరులకు ఒక్కో దానికి రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు, మిగిలిన వాటికి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వెచ్చిస్తున్నట్టు సమాచా రం. వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, గుండాట, పేకాట, కో తాట, ఇతర జూదాలు నిర్వహించేందుకు వీలు గా జర్మన్‌ షెడ్లు, ఫ్లడ్‌ లైట్లు, నగదు లెక్కించేందుకు కౌంటింగ్‌ మెషీన్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని బరుల వద్ద మద్యం స్టాళ్లు, ఫాస్ట్‌ఫుడ్స్‌, తినుబండరాలకు స్టాళ్లు వెలుస్తున్నాయి. బరి ప్రత్యేకత, అక్కడకు వచ్చే జనం రద్దీని బట్టి రూ.25 లక్షలు నుంచి రూ.1.50 కోటి వరకు ఇచ్చేలా నిర్వాహకులు జూదాలు ఏర్పాటుచేసుకునే వారితో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది.

సాక్షి, భీమవరం: కోడి పందేలు నిర్వహిస్తే ఖబడ్దార్‌ అంటున్న పోలీసుల హెచ్చరికలను నిర్వాహకులు డోంట్‌ కేర్‌ అంటున్నారు. షరా మామూలేనంటూ జిల్లావ్యాప్తంగా వందకుపైనే బరులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వీటిలో పెద్ద బరులు 30 వరకు ఉండగా, మిగిలినవి చిన్నవి. బరుల చెంతనే భారీ ఎత్తున గుండాట, పేకాట, కోతాటలతో జూదాల జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంప్రదాయం ముసుగులో..

కోడిపందేలు, పేకాట, గుండాట తదితర జూదాలపై సంపూర్ణ నిషేధం విధిస్తూ హైకోర్టు ఆదేశాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు జిల్లా పోలీస్‌ యంత్రాంగం ప్రకటించింది. ఆదివారం జిల్లాలోని పలుచోట్ల ఏర్పాటుచేసిన కోడిపందేల బరులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. సంప్రదాయం ముసుగులో ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని సబ్‌ డివిజన్ల పరిధిలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు, లేదా 112 నంబర్‌కు ఫోన్‌చేసి తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసు అధికారులు తెలియజేశారు.

నియోజకవర్గాల వారీగా బరులు

ఉండి : పెదఅమిరం, సీసలి, మాలవానితిప్ప, ఆకివీడులోని గుమ్ములూరు రోడ్డు, అజ్జమూరు, సిద్దాపురం, మహాదేవపట్నం, ఉండి, కోలమూరు, చెరుకువాడ, గొల్లలకోడేరు, పాలకోడేరు, శృంగవృక్షం, వేండ్ర, విస్సాకోడేరు, మోగల్లు, గరగపర్రు.

భీమవరం : డేగాపురం, శ్రీరాంపురం, గొల్లవానితిప్ప రోడ్డులో ప్రకాష్‌నగర్‌ వద్ద, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం, యనమదుర్రు, తుందుర్రు, వీరవాసరం, నవుడూరు, కొణితివాడ, మత్య్సపురి, నందమూరుగరువు

నరసాపురం : మొగల్తూరు, పేరుపాలెం, కేపీ పాలెం, మోళ్లపర్రు, కొత్తోట, ముత్యాలపల్లి, వేములదీవి, సీతారాంపురం, కొప్పర్రు, పీచుపాలెం, తూర్పుతాళ్లు, నరసాపురంలోని వీవర్స్‌ కాలనీ, ప్రభుత్వ ఆస్పత్రి వెనుక.

పాలకొల్లు : కలగంపూడి, యలమంచిలి, అడివిపాలెం, కొంతేరు, యలమంచిలి, మేడపాడు, మట్లపాలెం, కట్టుపాలెం, పూలపల్లి, వడ్లవానిపాలెం, శివదేవుని చిక్కాల, దిగమర్రు.

ఆచంట: కవిటం, పోడూరు, గుమ్ములూరు, పెనుమదం, వడలి, దొంగరావిపాలెం, పెనుగొండ, పెళ్లికూతురమ్మ చెరువు, ములపర్రు, రామన్నపాలెం, చినమదం, ఆచంట, వల్లూరు, ఆచంట వేమవరం, పెనుమంచిలి, కొడమంచిలి, పెనుమంట్ర, మార్టేరు, వెలగలేరు, సత్యవరం, పొలమూరు, నత్తారామేశ్వరం.

తణుకు : రేలంగి, తూర్పువిప్పర్రు, అయినపర్రు, ఓగిడి, అత్తిలి, కె.సముద్రపుగట్టు, గు మ్మంపాడు, తేతలి, తణుకులోని ఉండ్రాజవరం రోడ్డు, హైవే ఆనుకుని రెండు చోట్ల.

తాడేపల్లిగూడెం : ఏరియా ఆస్పత్రి వెనుక, పెంటపాడు, అల్లంపురం, కోరుమిల్లి, మీన వల్లూరు, జట్లపాలెం, పడమర విప్పర్రులో సిద్ధం చేస్తున్నారు.

ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పందెం బరులు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా దెందులూరు నియోజకవర్గంలో దుగ్గిరాల, నూజివీడు నియోజకవర్గంలో మీర్జాపురం, ఉంగుటూ రు నియోజకవర్గంలో నారాయణపురం, గొల్లగూడెం, బాదంపూడి అలాగే చింతలపూడి, పోలవ రం, కైకలూరు నియోజకవర్గాల్లో మరికొన్ని బరు లు ముస్తాబవుతున్నాయి. దుగ్గిరాల, మీర్జాపురం, గొల్లగూడెం, బాదంపూడి, నారాయణపురంలో భారీ బరులు ఏర్పాటు చేసి జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, కర్నాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున జూదరులు రావడానికి వీలుగా వస తితో సహా ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. మరోవైపు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు నిర్వాహకులుగా కొన్నిచోట్ల వ్యవహరిస్తుండటంతో రాష్ట్ర మంత్రులను ప్రత్యేకంగా కోడి పందేలకు ఆహ్వానించారు. ఇక పోలీసులు యథావిధిగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో దుగ్గిరాల గ్రామ శివారులో చిన్నపాటి బరి, ముసునూరు మండలం చెక్కపల్లి, నూజివీడు మండలం పోత్తిరెడ్డిపల్లి మరికొన్ని చోట్ల బరులను ధ్వంసం చేశారు.

కోట్లాటకు రెడీ

కోడిపందేలు నిర్వహిస్తే ఖబడ్దార్‌ అంటున్న పోలీసులు

డోంట్‌ కేర్‌ అంటున్న నిర్వాహకులు

జిల్లావ్యాప్తంగా వందకు పైనే బరులు సిద్ధం

గుండాట, పేకాట, కోతాటలకు ఏర్పాట్లు

భారీ మొత్తంలో చేతులు మారనున్న నగదు

న్యాయస్థానం ఆదేశాలు అమలయ్యేనా?

సార్లు.. ఇవిగో బరులు 1
1/2

సార్లు.. ఇవిగో బరులు

సార్లు.. ఇవిగో బరులు 2
2/2

సార్లు.. ఇవిగో బరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement