వైఎస్సార్‌సీపీలో ప్రతి కార్యకర్తకూ గుర్తింపు
పెనుమంట్ర : వైఎస్సార్‌సీపీలో డిజిటల్ బుక్ విధా నం ద్వారా గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తల పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేసి వారిని పార్టీలో నాయకుడిగా గుర్తించే కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారని పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. సోమ వారం పార్టీ ఆచంట నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని తూర్పుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారని, గ్రామస్థాయిలో బూత్ లెవెల్ నుంచి రాష్ట్రస్థాయి వరకు కార్యకర్తనే ప్రతినిధిగా ఎంచుకుని నాయకుడిగా గుర్తింపు నివ్వాలనే లక్ష్యంతో విధి విధానాలు రూపొందించారన్నారు. ప్రతి మైనర్ గ్రామం నుంచి 100 నుంచి 150, మేజర్ గ్రామాల నుంచి 300 నుంచి 400 మంది వరకు కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారన్నారు. కార్యకర్తలు మనోధైర్యంతో ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తిచూపి ప్రభుత్వ వ్యతిరేక సంతకం కార్యక్రమంలో నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలిపినందుకు అభినందనలు తెలిపారు.
గ్రామస్థాయి అనుబంధ కమిటీలు
పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తొలి విడత పది నియోజకవర్గాలను ఎంపిక చేసి గ్రామస్థాయిలో అనుబంధ కమిటీలు ఏర్పాటుకు జగన్ శ్రీకారం చుట్టారన్నారు. నరసాపురం పా ర్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి 15 నాటికి సభ్యత్వ నమోదు కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతి కార్యకర్త ప్రజలకు అండగా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, అందుకు జగన్ సహాయ, సహకారాలు ఉంటాయన్నారు.
పెనుమంట్ర, ఆచంట, పోడూరు, పెనుగొండ మండలాల కన్వీనర్లు గూడూరు దేవేంద్రుడు జక్కంశెట్టి సంటి, పిల్లి నాగన్న, నల్లిమిల్లి బాబిరెడ్డి, ఎంపీపీలు పోతినీడి వెంకటేశ్వర్లు, సుమంగళి, సీనియర్ నాయకులు మేడపాటి చంద్రమౌళీశ్వర రెడ్డి, దంపనబోయిన బాబురావు, చింతపల్లి గురుప్రసాద్, సుంకర సీతారాం, పోతుమూడి రామచంద్రరావు, చిన్నం ఏడుకొండలు, పిల్లి రుద్ర ప్రసాద్, కర్రి వేణుబాబు, సత్తి విష్ణు కుమార్ రెడ్డి, ముప్పల వెంకటేశ్వరరావు ,పలివెల శ్రీను, తాడి సుబ్బు రెడ్డి, దొంగ దుర్గాప్రసాద్, తమిళంపూడి సూర్యరెడ్డి, భూప తి రాజు శ్రీనివాసరాజు, అల్లం భాస్కర్‌రెడ్డి, గణేష్ల సు బ్బారావు, తాడి రాజారెడ్డి, బుర్ర రవికుమార్, రావి రత్నకుమార్, సత్తి వెంకటరెడ్డి, దివ్య శ్రీను, కాకి నేటి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు


