లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు
పాలకోడేరు: బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చే సుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడి న కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుతో పాటు రూ.20 వేల జరిమానా, బాధితురాలికి రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ భీమవ రం పోక్సో కోర్టు జడ్జి బి.లక్ష్మీనారాయణ సో మవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.. శృంగవృక్షంలోని నామనవారిపాలేనికి చెందిన పెరుమాళ్ల నరసింహారావు అలియాస్ చిన్నారి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాలిక (14)ను రోజు స్కూల్‌కు వెళ్లేటప్పుడు ప్రేమిస్తున్నానని వేధించాడు. ఈ క్రమంలో 2016 ఆగస్టు 28న బాలిక ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి లైంగికదాడికి పాల్పడినట్టు బాలి క తల్లిదండ్రులు పాలకోడేరు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన అప్పటి భీమవరం సీఐ ఆర్‌జీ జయసూర్య ద ర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నేరం రు జువు కావడంతో నిందితుడికి శిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేయాలని జడ్జి ఆదేశించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండవల్లి రమేష్‌నాయుడు వాదనలు వినిపించగా, పాలకోడేరు ఎస్సై మంతెన రవివర్మ, కానిస్టేబుళ్లు ఎం.బాలకృష్ణ, జి. గోపి కీలకంగా పనిచేశారు.


